ETV Bharat / international

ఉక్రెయిన్​లోని పాక్​ యువతికి భారత్​ సాయం.. మోదీకి థ్యాంక్స్

Russia Ukraine war: ఉక్రెయిన్​లో చిక్కుకున్న తాను సరిహద్దులకు చేరుకునేందుకు సాయ పడిన భారత రాయబార కార్యాలయం అధికారులు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్థాన్​ యువతి. భారత్​ సాయంతో తాను స్వదేశానికి వెళ్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. తమ దేశ పౌరులను పొల్టావాకు తరలించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా.

Russia Ukraine war
మోదీకి పాకిస్థాన్​ యువతి, బంగ్లా ప్రధాని కృతజ్ఞతలు
author img

By

Published : Mar 9, 2022, 12:58 PM IST

Russia Ukraine war: ఉక్రెయిన్‌ నుంచి తనను సురక్షితంగా సరిహద్దులకు తరలించినందుకు పాకిస్థాన్‌కు చెందిన యువతి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. యుద్ధం జరుగుతున్న నగరం నుంచి ఉక్రెయిన్‌ సరిహద్దులకు వెళ్లేందుకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎంతో సహాయం చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఆస్మా షాఫిక్ కృతజ్ఞతలు తెలిపింది.

  • #WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.

    Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp

    — ANI (@ANI) March 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" నా పేరు ఆస్మా షాఫిక్. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి చాలా కృతజ్ఞతలు. చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి ఇక్కడికి(ఉక్రెయిన్ సరిహద్దులకు) రావడానికి సాయం చేశారు. ఈ సందర్భంగా మాకు సహాయం చేసిన భారత ప్రధానమంత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత రాయబార కార్యాలయం సహాయంతో నేను నా స్వదేశానికి వెళ్తున్నాను."

- ఆస్మా షాఫిక్​, పాకిస్థాన్​ యువతి

మోదీకి బంగ్లాదేశ్‌ ప్రధాని కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో మన దేశ పౌరులతో పాటు ఇతర దేశస్థులూ ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్నారు. 'ఆపరేషన్‌ గంగ' కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం అక్కడున్న భారతీయులను తరలిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలకు చెందిన పలువురిని సైతం ఆపరేషన్‌ గంగ ద్వారా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం 12 బస్సుల్లో సుమీలోని భారతీయులతో పాటు బంగ్లా, నేపాల్‌ దేశీయులను పొల్టావాకు తరలించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ శరణార్థుల్లో 8లక్షల మంది చిన్నారులు

రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో మానవ సంక్షోభం తలెత్తింది. యుద్ధ భయంతో లక్షలాది మంది పౌరులు దేశం విడిచి పొరుగు దేశాలకు పారిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 20లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారు. అయితే ఇందులో చిన్నారులు 8లక్షల మంది వరకు ఉన్నారని సేవ్‌ ది చిల్డ్రన్‌ వెల్లడించింది. ఇందులో చాలా మంది చిన్నారులు తల్లిదండ్రులు లేకుండానే వేరే దేశాలకు వలస వెళ్లిపోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

చెర్నోబిల్‌తో సంబంధాలు కోల్పోయిన ఐఏఈఏ

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ రష్యా సేనల వశమైంది. అయితే ప్రస్తుతం ఆ ప్లాంట్‌తో ఇంటర్నేషనల్ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సంబంధాలు కోల్పోయినట్లు తెలిసింది. చెర్నోబిల్‌ నుంచి ఐక్యరాజ్యసమితి అణు నియంత్రణ సంస్థకు ఎలాంటి డేటా రావట్లేదని ఏజెన్సీ వెల్లడించింది. అక్కడి ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.

విదేశీ కరెన్సీ విత్‌డ్రాపై పరిమితులు విధించిన రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌

ఉక్రెయిన్‌పై యద్ధం చేస్తోన్న రష్యా ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది. మరోవైపు రష్యాలో విదేశీ కరెన్సీ విత్‌డ్రాపై ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ తాత్కాలిక పరిమితులు విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ఆ ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.