ఫ్రాన్స్ పారిస్‌లోని ఈఫిల్ టవర్ లోపల బాంబు పెట్టినట్లు ఫోన్‌కాల్ రావడం వల్ల పోలీసు దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే సందర్శనీయ ప్రదేశంలో ఉన్న పర్యటకుల్ని ఖాళీ చేయించి.. పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. బారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రించారు. విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే.. ఎక్కడా బాంబు సంబంధిత ఆనవాళ్లు కనిపించలేదు.
కాసేపటి తర్వాత.. రాకపోకలకు అనుమతిచ్చారు. క్రమంగా ఆంక్షలను ఎత్తివేశారు.
131 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఫిల్ టవర్‌ను రోజూ 25 వేలమందికిపైగా సందర్శిస్తారు. కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో.. పర్యటకుల్ని పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం బెదిరింపు ఫోన్ కాల్ రావడం అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది.