ETV Bharat / international

Omicron Origin: ఒమిక్రాన్‌పై ఎన్నో సందేహాలు.. సమాధానాలు ఎప్పుడో?

Omicron Origin: ప్రపంచవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్​ గుట్టును కనుగొనేందుకు మరికొన్ని వారాలు నిరీక్షించక తప్పదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనాలోని వుహాన్‌లో వచ్చిన తొలి కరోనా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో దాదాపు 30 మార్పులు వచ్చినట్లు తేల్చారు.

Omicron Origin
ఒమిక్రాన్ వ్యాప్తి
author img

By

Published : Dec 5, 2021, 1:30 PM IST

Omicron Origin: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సందేహాల తుపాను చెలరేగింది. ఇది తీవ్ర స్థాయి వ్యాధిని కలిగిస్తుందా? ప్రస్తుత కొవిడ్‌ టీకాలను ఏమారుస్తుందా? దీని తీరుతెన్నులు ఎలా ఉంటాయి? వంటి అంశాలపై చర్చ నడుస్తోంది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు వెలుగులోకి రావడానికి మరికొన్ని వారాలు ఎదురుచూడక తప్పదని వారు స్పష్టంచేస్తున్నారు.

ఎందుకు ఆందోళన?

కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లోని జన్యుక్రమంలోని అన్ని భాగాల్లో అనేక ఉత్పరివర్తనాలు తలెత్తడం వల్ల ఒమిక్రాన్‌ పుట్టుకొచ్చింది. దీనికితోడు దక్షిణాఫ్రికాలో ఇది విస్తృతంగా వ్యాపించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించడం వల్ల అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరోపక్క ఒమిక్రాన్‌లోని కొన్ని ఉత్పరివర్తనాలు ఇతర వేరియంట్లలోనూ కనిపించడం గమనార్హం. విడివిడిగా చూసినప్పుడు వీటిలో కొన్ని.. వైరస్‌ వ్యాప్తిని పెంచేవే. అయితే ఒమిక్రాన్‌లో అనేక ప్రత్యేక ముటేషన్లు ఉన్నాయి.

ఉదాహరణకు.. చైనాలోని వుహాన్‌లో వచ్చిన తొలి కరోనా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో దాదాపు 30 మార్పులు వచ్చాయి. డెల్టాలో ఇలాంటివి 10 మాత్రమే ఉన్నాయి.

ఫలితాలకు ఎందుకంత సమయం?

ఒమిక్రాన్‌లోని బహుళ ఉత్పరివర్తనాలు పరస్పరం ఎలా చర్యలు జరుపుతాయన్నది.. ఆ వేరియంట్‌ తీరుతెన్నులను అర్థం చేసుకోవడంలో కీలకమవుతుంది. దీనిపై పరిశోధనలు సంక్లిష్టమైనవి. అందులో వివిధ అంశాలివీ..

వైరస్‌ వృద్ధి.. రోగి నుంచి ఒమిక్రాన్‌ నమూనాలను పరిశోధకులు సేకరించి, ల్యాబ్‌లో వృద్ధి చేయాలి. రోగుల స్వాబ్‌లో వైరస్‌ పరిమాణం చాలా తక్కువగానే ఉంటుంది. దీన్ని వృద్ధి చేయడం వల్ల ప్రయోగాలకు సరిపడిన సంఖ్యలో వైరస్‌ అందుబాటులో ఉంటుంది. ఇందుకు సమయం పడుతుంది.

ఈ ప్రక్రియలో వైరస్‌ వృద్ధికి అనువైన కణాల లభ్యత చాలా కీలకం. అత్యున్నతస్థాయి బయోసేఫ్టీ ప్రమాణాలున్న ల్యాబ్‌లోనే ఈ ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. జన్యు సాధనాలను ఉపయోగించి కూడా ల్యాబ్‌లో వైరస్‌ను తయారుచేయవచ్చు. ఇందులో వైరస్‌ ఉత్పత్తిని ప్రారంభించడానికి సార్స్‌ కోవ్‌-2 జన్యుక్రమం సరిపోతుంది. రోగి నమూనాలు అవసరంలేదు.

Omicron Spike Protein:

తేల్చేది ఇదే.. : ఒమిక్రాన్‌లోని ఉత్పరివర్తనాల వల్ల ఈ వేరియంట్‌ వ్యాప్తి, టీకాలతో వచ్చే రోగనిరోధక శక్తిని ఎలా ఏమారుస్తుందన్నది ప్రాథమిక అధ్యయనాలు పరిశీలిస్తాయి. మానవ కణాల్లోకి ప్రవేశానికి వైరస్‌కు ఉపయోగపడే ఏసీఈ2 గ్రాహకాలతో ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌ చర్యలు జరిపే తీరును శోధిస్తారు. కణంలోకి ప్రవేశించాక ఈ వేరియంట్‌ ఎలా వృద్ధి చెందుతుందన్నది తదుపరి పరిశోధనల్లో దృష్టిసారిస్తారు.

ప్రస్తుత టీకాలతో ఉత్పన్నమైన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను ఎంతమేర అడ్డుకుంటాయన్నది 'న్యూట్రలైజేషన్‌ అధ్యయనాల్లో' తేలుతుంది. దీనికి టీకా పొందిన వ్యక్తి నుంచి సీరం అవసరం. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ఇవి ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది పరిశీలిస్తారు. బూస్టర్‌ డోసుల సమర్థతనూ పరిశోధించనున్నారు.

ఇదీ చూడండి: ఒమిక్రాన్ గుబులు.. పెరుగుతున్న కరోనా కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.