ETV Bharat / international

పిల్లలు చెమట చుక్కలు చిందించట్లేదు - పిల్లలు వ్యాయామం

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పిల్లలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏకంగా 146 దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు గంటపాటు శ్రమించేవారు 20% కంటే తక్కువే ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

పిల్లలు చెమట చుక్కలు చిందించట్లేదు
author img

By

Published : Nov 23, 2019, 11:59 AM IST

ఆట పాటలతో హుషారుగా ఉండాల్సిన కిశోరప్రాయం స్తబ్ధుగా తయారవుతోంది! సెల్‌ఫోన్‌కు దగ్గరవుతూ మైదానానికి దూరమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 146 దేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయట్లేదు. ఫలితంగా వారి శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పెరుగుతున్నాయి. మేధో వికాసంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధకులు జరిపిన అధ్యయనం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టింది. పిల్లల్లో శారీరక క్రియాశీలతను పెంచేందుకు సత్వరం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది.

బంగ్లాదేశ్​ కాస్త మెరుగు

ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో కనీసం నలుగురు రోజుకు గంట సేపు కూడా శారీరక శ్రమ చేయట్లేదు. 78% బాలురు, 85% బాలికల్లో ఈ పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్‌ మెరుగ్గా ఉంది. ఆ దేశంలో 66% మంది బాలలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో కేవలం 7% మంది బాలురు, దక్షిణ కొరియాలో 3% మంది బాలికలు మాత్రమే రోజుకు గంటపాటు శారీరక శ్రమ చేస్తున్నారు.

భారత్​లో

మనదేశంలో 72% మంది బాలురు రోజులో కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయట్లేదు. ప్రపంచ సగటు(78%)తో పోలిస్తే ఇది కాస్త మెరుగే. బంగ్లాదేశ్‌, భారత్‌లో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండటానికి క్రికెట్‌ వంటి క్రీడలకు ఉన్న ఆదరణ ప్రధాన కారణం. ఇంటి పనులు చేస్తుండటంతో ఈ రెండు దేశాల్లో బాలికలు వ్యాయామం చేసినట్లవుతోంది.

రోజుకో గంట

కిశోరప్రాయులు ప్రతిరోజు గంట పాటు వ్యాయామం చేయాలన్నది డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు.

New WHO-led study says majority of adolescents worldwide are not sufficiently physically active, putting their current and future health at risk
అధ్యయనంలోని అంశాలు

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Saturday 23rd November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: "I want to stay" says Guardiola about his desire to remain Man City boss. Already moved.
BOXING: Deontay Wilder and Luis Ortiz weigh in ahead of their 23 November heavyweight title bout at MGM Grand Garden Arena, Las Vegas, Nevada, USA. Already moved.
TENNIS: Reaction after Spain beat Argentina 2-1 in the Davis Cup Quarterfinals. Expect at 0200.  
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.