ETV Bharat / international

'అప్పుడే మేల్కొంటే 59వేల మంది బతికేవారు'

కరోనా వైరస్​ వ్యాప్తి చెందిన మొదట్లోనే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే 59 వేల మందిని కాపాడి ఉండవచ్చని బ్రిటన్​కు చెందిన నిపుణులు ఓ నివేదికలో పేర్కొన్నారు. ఐరోపాను చూసి పలు దేశాలు గుణ పాఠం నేర్చుకున్నాయని తెలిపారు.

Lockdowns may have saved 59,000 lives in Europe: study
'అప్పుడే అప్రమత్తమైతే.. 59వేల మంది బతికేవారు'
author img

By

Published : Apr 1, 2020, 6:17 AM IST

కరోనా వ్యాప్తి చెందిన తొలి దశలోనే ఐరోపాలోని 11 దేశాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేసి ఉంటే 59 వేల మందిని కాపాడే అవకాశం ఉండేదని బ్రిటన్​ నిపుణులు చెబుతున్నారు. కొవిడ్​-19 వల్ల నమోదైన మరణాల సంఖ్య ఆధారంగా లండన్ ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు ఓ నివేదికను విడుదల చేశారు.

వైరస్​ను అరికట్టే క్రమంలో పలు దేశాలు ఆంక్షలు విధించి ప్రజలు ఇంటి వద్దే ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. గతేడాది చివర్లో చైనాలో ఉద్భవించిన వైరస్​కు ఇప్పటి వరకు 42,000 మందికిపైగా బలయ్యారు. ఇటలీలో ఓ వైపు వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉన్నా... లాక్​డౌన్​ చర్యలు ఆరోగ్య విపత్తును నివారించగలిగాయని వివరించారు. ఈ నియంత్రణ చర్యలు 38,000 మంది ప్రాణాలను రక్షించాయని అంచనా వేశారు పరిశోధకులు.

ఐరోపా నుంచి గుణ పాఠం

ఐరోపా దేశాల్లోని కరోనా మరణాల సంఖ్యను చూసి పలు దేశాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా కరోనా వ్యాప్తి రేటును గణనీయంగా తగ్గించుకున్నాయని లండన్​ ఇంపీరియల్​ కళాశాల పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్​ వంటి దేశాల్లో కార్యక్రమాల రద్దు, లాక్​డౌన్​ వంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం పడిందో చూసి మిగిలిన దేశాలు పాఠాలు నేర్చుకున్నాయని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.