ETV Bharat / international

జైలులో వికీలీక్స్​ వ్యవస్థాపకుడి పెళ్లికి అనుమతి - జూలియన్​ అసాంజే వివాహం

బ్రిటన్​లో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్​ వ్యవస్థాపకుడు అసాంజేకు వివాహం చేసుకునేందుకు అనుమతి లభించింది. త్వరలో తన భాగస్వామైన స్టెల్లా మోరిస్​ను (Stella Morris Julian Assange) అసాంజే పెళ్లి చేసుకోనున్నారు.

Stella Morris Julian Assange
జైలులో వికీలీక్స్​ వ్యవస్థాపకుడి వివాహానికి అనుమతి
author img

By

Published : Nov 12, 2021, 6:01 PM IST

బెయిల్​ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జూలియన్​ అసాంజేకు భాగస్వామి స్టెల్లా మోరిస్​ను (Stella Morris Julian Assange) వివాహం చేసుకునేందుకు బ్రిటన్​ ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే వివాహం (Stella Morris Julian Assange) జరిగే తేదీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

వివాహానికి అధికారులు అనుమతివ్వడంపై అసాంజే భాగస్వామి స్టెల్లా మోరిస్ (Stella Morris Julian Assange)​ స్పందించారు. 'ఇక మీదట మా పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రావని ఆశిస్తున్నాను' అని స్టెల్లా పేర్కొన్నారు.

ఈక్వెడార్​ రాయబార కార్యాలయంలో..

లండన్​లోని ఈక్వెడార్​ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్​తో ప్రేమలో పడ్డారు అసాంజే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏప్రిల్​లో అసాంజే-మోరిస్​ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది జనవరిలో.. జైలులో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే వికీలీక్స్​లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్​లోని ఈక్వెడార్​ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. ఈక్వెడార్​ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్​ పోలీసులు అసాంజేను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.