కరోనాపై పోరాడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ప్రస్తుతం లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బోరిస్. వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రి ఆవరణలోనే వాకింగ్ చేస్తున్నారు. కాలక్షేపం కోసం పజిల్, సుడోకు వంటి గేమ్స్ ఆడుతున్నారు. సినిమాలతోనూ ప్రధాని కాలక్షేపం చేస్తున్నట్టు డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది.
"జాన్సన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. తనకు సేవ చేస్తున్న వైద్య బృందానికి బోరిస్ ధన్యవాదాలు తెలిపారు. జాన్సన్ బెడ్‌పై ఉంటూనే పజిల్స్, సుడోకు వంటివి ఆడుతున్నారు. అంతేకాకుండా 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్', 'విత్నెయిల్ అండ్ ఐ' సినిమాలు చూశారు. విశ్రాంతి తీసుకుంటూ, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నారు."
- డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి, బ్రిటన్
జాన్సన్ త్వరగా కోలుకోవాలని..
జాన్సన్‌ను చూడటానికి ఎవరినైనా అనుమతినిస్తున్నారా, లేదా అనేదానిపై డౌన్ స్ట్రీట్ స్పష్టతనివ్వలేదు. ఆయన కాబోయే భార్య కూడా బోరిస్‌ను కలిశారా లేదా అన్నది ఇంకా తెలియదు. కానీ ప్రధాని కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వేలకొద్ది కార్డులొస్తున్నాయని తెలిపింది డౌన్ స్ట్రీట్.
ఇదీ చదవండి: స్పెయిన్‌లో మరోసారి తగ్గిన కరోనా మరణాలు