ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు చేపట్టాలనే తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో వేసిన ఈ తీర్మానంపై భారత్ సహా 13 దేశాలు స్పందించలేదు.
చైనా, రష్యా సహా 22 దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. 9 సభ్య దేశాలు నిరాకరించాయి.
ఇటీవలే 11 రోజుల పాటు ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా, తూర్పు జెరూసలెం, ఇజ్రాయెల్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై దర్యాప్తు జరిపేందుకు యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు తీర్మానం వేశాయి.
ఇదీ చదవండి: పశ్చిమాసియాలో శాంతి విలసిల్లేనా?