ఇటలీ తూర్పు తీర ప్రాంతం భారీ తుపాను ధాటికి గజగజా వణికిపోయింది. వడగళ్ల వానలో చిక్కుకుని 18 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. పెస్కరా నగరంలో ప్రధాన వీధుల్లోకి వరద నీరు చేరింది.
వడగళ్ల వానలో చిక్కుకోవడం వల్ల బాధితుల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని పెస్కరాలోని ఓ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ గదికి మార్చి, చికిత్స అందిస్తున్నారని ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఎల్ఏ తెలిపింది.
దక్షిణ-మధ్య ఇటలీ, వెనాఫ్రోలోనూ వడగళ్ల వానలు కురిశాయి. తుపాను ధాటికి చెట్లు నేలకూలాయి. కిటికీలు, విండ్షెడ్లూ పగిలిపోయాయి. ఇటలీలో కొన్ని వారాలుగా ఉన్న వేసవి కాలపు వేడి తర్వాత భారీ వర్షం కురిసింది.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: కుమారస్వామి రాజీనామా చేయక తప్పదా?