ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రష్యాలో కొత్తగా 7,212 కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,136,048కి, మరణాల సంఖ్య 20,056కి చేరింది.
బ్రిటన్‌లో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో కఠిన లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నేపాల్‌లో 70వేలపైకి
నేపాల్‌లో కరోనా వైరస్ కేసులు 70 వేల మార్క్ దాటాయి. ఒక్కరోజులో 1,313 కొత్త కేసులు నమోదైనట్లు నేపాల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్ మృతుల సంఖ్య 459కి చేరినట్లు వెల్లడించింది.
పాక్‌లో 798 కొత్త కేసులు
పాకిస్థాన్‌లో మరో 798 కేసులు నమోదవ్వగా.. మొత్తం బాధితుల సంఖ్య 309,015కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి ఇప్పటి వరకు 294,740 మంది కోలుకోగా.. ప్రస్తుతం 7,831 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. దేశంలో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 6,444గా నమోదైనట్లు వివరించింది.
రెండోసారి తెరుచుకున్న డిస్నీలాండ్
హాంకాంగ్‌లో కరోనా కేసులు దాదాపు సున్నాకు చేరుకుంటున్న నేపథ్యంలో రెండోసారి డిస్నీల్యాండ్ తెరుచుకుంది. తొలుత కరోనా విజృంభణ సమయంలో రిసార్ట్ మూసేయగా.. కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి ప్రారంభించింది. అయితే వేసవిలో మళ్లీ కేసులు పెరగటం కారణంగా మరోసారి డిస్నీల్యాండ్‌ను మూసేసింది.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ వినియోగానికి చైనాకు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్ఓ!