కరోనా మహమ్మారి బారినపడిన దేశాధినేతల జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేరారు. మొదటి కరోనా లక్షణం కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు ఫాన్స్ అధ్యక్ష భవనం ప్రకటనలో తెలిపింది. వారం రోజుల పాటు మేక్రాన్ స్వీయ నిర్బంధంలో ఉంటారని, భౌతిక దూరం పాటిస్తూ యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని పేర్కొంది.
అయితే మేక్రాన్‌కు మొదట బయటపడ్డ కరోనా లక్షణం ఏంటనే విషయంపై మాత్రం ఫ్రాన్స్ అధ్యక్ష భవనం స్పష్టత ఇవ్వలేదు.