గ్రీస్‌లోని లెస్బోస్ ద్వీపంలో ఏర్పాటు చేసిన మోరియా శరణార్థుల శిబిరంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం కొవిడ్-19 లాక్డౌన్లో ఉన్న ఈ శిబిరంలో 12,000 మందికిపైగా వలసదారులు, శరణార్థులు ఉన్నారు. నివాసంగా మార్చిన ఓ కంటెయినర్లో నుంచి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.


అంతా క్షేమం..!
ప్రమాదం సంభవించిన సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల నిమిషాల వ్యవధిలోనే శిబిరం అంతటా మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో నల్లని పొగ అలుముకుంది. సమీపంలోని కొండ ప్రాంతాలు, ఆలీవ్ తోపును దహనం చేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు వెల్లడి కాలేదు.




కేవలం 2,750 మంది కోసం నిర్మించిన ఈ శిబిరంలో 12,500మందికి పైగా శరణార్థులు, వలసదారులు ఉంటున్నారని, అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చాలా రోజులుగా సహాయక సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.
ఇదీ చూడండి: హిమాలయ నదుల్లోని ఆ చేపలకు కష్టకాలం