ఓ ఆరేళ్ల పిల్లాడు అక్వేరియమ్ పక్కన కూర్చుని నీళ్లతో సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలో ఓ డాల్ఫిన్ బాలుడిని చేతిని కరిచేసింది. దాంతో అతడి చేతిపై మూడు పెద్ద గాట్లు పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
నీళ్ల నుంచి డాల్ఫిన్ బయటకు వచ్చి బాలుడి చేయి కరిచిందని @odessa_hello అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుడు పేర్కొన్నారు. ఈ ఘటన ఉక్రెయిన్ బ్లాక్ సీ రిసార్ట్‌లోని నీమో డాల్ఫినేరియమ్ వద్ద జరిగిందని తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆహారం అనుకునే అలా..
అయితే.... దీనిపై డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చే లాడ్బైబిల్ అనే వ్యక్తి స్పందిస్తూ.. బాలుడిపై డాల్ఫిన్ కావాలనేం దాడి చేయలేదని చెప్పారు. " నీళ్లపై చేతిని ఆడిస్తున్నట్లుగా కనిపించింది. అంటే.. తన కోసం ఎవరైనా ఆహారాన్ని అందిస్తున్నారేమోనని డాల్ఫిన్ భావించింది. అందుకే ఆ చిన్నారి చేయిని కరిచింది." అని తెలిపారు.
ఆకలిగా ఏం లేదు..
సదరు బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు మిర్రర్ వార్తా కథనం వెలువరించింది. అక్కడ అతనికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలిపింది. కాగా.. ఈ ఘటన జరిగిన డాల్ఫినేరియమ్ ప్రతినిధులు మాత్రం డాల్ఫిన్ ఆకలితోనో లేదా ఆగ్రహంగానో లేదని పేర్కొన్నారు. ఏదేమైనా.. డాల్ఫిన్ల వద్ద సందర్శకుల కోసం భద్రతను మరింతగా పెంచుతామని చెప్పారు.
ఇదీ చూడండి: డాల్ఫిన్‌కు, కుక్కకు దోస్తీ కుదిరిందిలా...
ఇదీ చూడండి: కస్తూర్బా విద్యాలయంలో డాల్ఫిన్ చదువు