ETV Bharat / international

'స్వైన్​ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం' - Coronavirus majorly affected cities

ప్రపంచంపై పంజా విసురుతున్న కరోనాపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). 2009లో వచ్చిన స్వైన్​ఫ్లూ కంటే కొవిడ్-19 పదిరెట్లు తీవ్రమైనదని వ్యాఖ్యానించింది. వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్​డౌన్​ను ఒకేసారి కాకుండా దశలవారిగా ఎత్తేయాలని ప్రపంచదేశాలకు సూచించింది.

corona
'స్వైన్​ఫ్లూ కంటే పది రెట్లు ప్రమాదకరం కరోనా'
author img

By

Published : Apr 13, 2020, 11:05 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). మానవాళికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఈ వైరస్.. 2009లో ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టిన స్వైన్​ఫ్లూ కంటే పది రెట్లు తీవ్రమైనదని తెలిపింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్​డౌన్ ఆంక్షలను నెమ్మదిగా ఎత్తేయాలని అభిప్రాయపడింది.

" కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు. 2009లో వచ్చిన స్వైన్​ఫ్లూ కంటే ఈ వైరస్ పది రెట్లు ప్రమాదకరం"

-టెడ్రోస్ అధానోం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు

న్యూయార్క్​లో పదివేలమంది మృతి..

అమెరికాలోని న్యూయార్క్​ రాష్ట్రంలో ఇప్పటివరకు 10,000 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో గత 24 గంటల వ్యవధిలో 772 మంది మృతిచెందారు. ఇందులో న్యూయార్క్​ రాష్ట్రంలోనే 671 మంది అసువులు బాశారు. ఇప్పటివరకు మొత్తం 22,877 మంది చనిపోయారు. కొత్తగా 6,354 మందికి వైరస్ సోకగా.. బాధితుల సంఖ్య 5లక్షల 66వేల 654కు పెరిగింది.

బ్రిటన్​లో పదకొండు వేలమంది..

కరోనాతో బ్రిటన్​లో తాజాగా 717 మంది మరణించారు. దేశంలో మొత్తంగా 11,329 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కొన్ని రోజులుగా బ్రిటన్​లో కొవిడ్​-19 మరణాలు తగ్గుముఖం పట్టాయి.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.