ETV Bharat / international

'కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండాలి'

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను ఎవరు కనిపెట్టినా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ కోరారు. వ్యాక్సిన్​ను ప్రాంతానికో, దేశానికో పరిమితం చేయారాదని ప్రపంచ దేశాల్లోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

corona vaccine
'కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండాలి'
author img

By

Published : Apr 25, 2020, 8:14 AM IST

అమెరికా, బ్రిటన్​ సహా ప్రపంచ దేశాలు కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నైపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్సిన్​ను ఎవరు కనుగొన్నా అది ప్రపంచంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాంతానికో, దేశానికో వాక్సిన్​ను పరిమితం చేయరాదని పేర్కొన్నారు.

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజారోగ్యం కోసం శథవిధాలా ప్రయత్నించాలని స్పష్టం చేశారు గుటేరస్​.

" యావత్ మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్సిన్​ కనిపెట్టే పయత్నాలు కొనసాగించాలి. అందరికి ఆమోదయోగ్యమైన ధర ఉండాలి. ప్రపంచదేశాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి కరోనా పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంచుకుని వ్యాక్సిన్​ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలి."

-ఆంటోనియో గుటేరస్​, ఐరాస ప్రధాన కార్యదర్శి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.