ETV Bharat / international

బ్రెగ్జిట్​పై ప్రతిపక్షంతో మరోమారు 'మే' చర్చలు - Brexit

ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రాకుండా చూసేందుకు బ్రిటన్​ ప్రధాని ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షంతో మరోమారు చర్చలకు సిద్ధమయ్యారు.

లేబర్​ పార్టీ నేత జెరెమీ కోర్బిన్​తో బ్రిటన్​ ప్రధాని చర్చలు
author img

By

Published : Apr 4, 2019, 8:28 AM IST

Updated : Apr 4, 2019, 9:08 AM IST

లేబర్​ పార్టీ నేత జెరెమీ కోర్బిన్​తో బ్రిటన్​ ప్రధాని చర్చలు
బ్రెగ్జిట్​పై ప్రధాన ప్రతిపక్షపార్టీతో చర్చలు జరపనుంది బ్రిటన్​ ప్రభుత్వం. నో డీల్​ బ్రెగ్జిట్​ను అధిగమించేందుకు అన్ని దారులు మూసుకుపోయినందున లేబర్​ పార్టీ నేత జెరెమీ కోర్బిన్​తో చర్చలకు సిద్ధమయ్యారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే. కొత్త ప్రతిపాదనను నేడు జెరెమీకి పూర్తిగా వివరించనున్నారు.

ఇప్పటికే బ్రెగ్జిట్​పై థెరిసా మే ప్రవేశపెట్టిన 3 ప్రతిపాదనలు బ్రిటన్​ పార్లమెంట్​లో వీగిపోయాయి. ప్రత్యామ్నాయాలపై కసరత్తులు చేసినప్పటికీ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు.

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు ఈనెల 12తో గడువు ముగుస్తుంది. ఈ​ గడువును పొడిగించాలన్న తీర్మానం బ్రిటన్​ పార్లమెంట్​లోని దిగువ సభలో ఒక్క ఓటు అధిక్యంతో ఆమోదం పొందింది. నేడు ఎగువసభ ముందుకు రానుంది.

గడువు పెంపు తీర్మానాన్ని పార్లమెంట్​ ఎగువసభ ఆమోదించకపోతే... బ్రిటన్​ ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాల్సి వస్తుంది.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 4, 2019, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.