ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రిటన్ రాజకుమారుడు డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మెర్కెల్ అప్పుడే తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన (నటన) వృత్తిని తిరిగి చేపట్టేందుకు మేఘన్ డిస్నీ లండన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మేఘన్ టీవీ సీరియళ్లలో, సినిమాల్లో నటించారు. ప్రిన్స్ హ్యారీతో వివాహమైన తరువాత నట జీవితాన్ని వదులుకున్నారు.
విరాళం కాదు.. కలిసి పనిచేస్తా
ఏనుగుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న 'ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్' అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా, మేఘన్.... వారితో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది.
మహారాణికి ఓ లేఖ
సీనియర్ రాయల్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు మేఘన్ ఇటీవలే రాజకుటుంబానికి లేఖ రాశారు. రాణి ఎలిజబెత్‌కు మద్దతుగా ఉంటూనే.. సొంతంగా పనిచేసుకోవాలని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై రాణి ఎలిజబెత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'అంగారక యాత్ర' వ్యోమగాముల్లో ఇండో-అమెరికన్