అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతితో చెలరేగుతున నిరసనలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఆ ఘటన క్షమించరానిదని బోరిస్ వ్యాఖ్యానించారు. అమెరికన్ల ఆగ్రహ జ్వాలలను తాను అర్థంచేసుకోగలనని తెలిపారు.
"అమెరికాలో జరిగిన భయానకమైన సంఘటన క్షమించరానిది. అక్కడ ఏం జరిగిందో మనందరం చూశాం. ఆ దేశ పౌరులు చేస్తున్న నిరసనలు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అయితే నిరసనలు చట్టబద్ధమైన, సహేతుకమైన మార్గంలో జరగాలి."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ను ఐరోపా సమాఖ్య నుంచి విజయవంతంగా బయటకు తీసుకొచ్చిన జాన్సన్... అమెరికాతో సత్ససంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నారు. అయితే అమెరికా ఎగుమతి చేస్తున్న బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని జాన్సన్ ఖండించారు. ఆయుధ ఎగుమతులు మానవ హక్కుల నియమాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు బోరిస్.
ఇదీ చూడండి: 'హైడ్రాక్సీ' పరీక్షలకు డబ్ల్యూహెచ్ఓ అంగీకారం