బ్రిటన్లో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం ఐరోపాలోనే అధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్ నిలిచింది. కరోనా మరణాల్లో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది.
గత 28 రోజుల్లో 1,820 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు విడిచారని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 93,290కి చేరింది. బుధవారం ఒక్కరోజే 38వేల 905 కొత్త కేసులు నమోదయ్యాయి.
కఠిన లాక్‌డౌన్ ఆంక్షలతో గతంతో పోల్చుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. ఇతర ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలతో పోల్చుకుంటే బ్రిటన్లో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇదీ చదవండి: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు