ప్రస్తుత కొవిడ్-19 కాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీ-పీసీఆర్ టెస్టు అయినా చేయించుకోవాలి.. లేదా పూర్తిగా వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలి. అంతేనా.. వాటికి రుజువులు(ఫ్రూఫ్) కూడా మన వెంటే ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్లినా నో ఎంట్రీ బోర్డే. ఇందుకోసం భారత్ లాంటి దేశాలు ధ్రువపత్రాలు జారీ చేస్తుంటే.. ఐరోపా దేశాలు గ్రీన్‌పాస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇటలీ కూడా ఈ వ్యవస్థనే అనుసరిస్తున్నట్లు ఆగస్టులో ప్రకటించింది. దీని ప్రకారం.. బయటకు వెళ్లి టీ, కాఫీ లాంటివి తాగాలన్నా గ్రీన్‌పాస్ తప్పనిసరి.
అందుకే ఆ దేశానికి చెందిన ఆండ్రియా కొలొనెట్టా అనే విద్యార్థి.. గ్రీన్పాస్పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఏకంగా చేయిపై పచ్చబొట్టు (tattoo) వేయించుకున్నాడు. దానిని వీడియో తీసి.. టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. సాధారణంగా ఇవి పని చేస్తాయని చెప్పలేం! అయితే అతని ఫాలోవర్ ఒకరు దానిని స్కాన్ చేయగా.. క్యూఆర్ కోడ్ ప్రకారం ఆండ్రియా.. టీకా తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు ఆ టాటూ సాయంతో మెక్డొనాల్డ్స్లోకి వెళ్లి.. తనకు నచ్చిన ఫుడ్ తిన్నాడు. దీంతో ఇకపై ఎక్కడి వెళ్లినా.. గ్రీన్‌పాస్ మర్చిపోయానని భయపడక్కర్లేదని అంటున్నాడు ఆండ్రియా. అలాగే అందరికంటే భిన్నంగా ఉండటం ఇష్టమని చెబుతున్నాడు.
ఇదీ చూడండి: స్టూడెంట్ మాస్క్ పెట్టుకోలేదని.. క్లాస్ మధ్యలోనే ప్రొఫెసర్ రిటైర్మెంట్