ETV Bharat / international

'మేము అధికారంలోకి వస్తే ఆ భూభాగాలను తీసుకుంటాం' - india nepal border news

Kalapani Dispute: తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వివాదస్పద భూభాగాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి తీసుకుంటామని చెప్పారు నేపాల్​ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తామే తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోబోమన్నారు.

K P Sharma Oli
కేపీ శర్మ ఓలి
author img

By

Published : Nov 27, 2021, 9:48 AM IST

Kalapani Dispute: నేపాల్​తో కాలాపానీ, లిపులేఖ్‌ సరిహద్దు వివాదం నేపథ్యంలో(India Nepal Border Dispute).. ఆ దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ఛైర్మన్​ కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. వివాదస్పద భూభాగాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కమ్యూనిష్టు పార్టీ ఆఫ్​ నేపాల్​ 10వ సాధారణ సమావేశంలో ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు.

"మేము అధికారంలోకి వస్తే.. వివాదస్పద ప్రాంతాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి వెనక్కి తీసుకుంటాం. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తాం తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోం. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ శక్తిగా సీపీఎన్​-(యూఎంఎల్​)పార్టీ ఆవిర్భవిస్తుంది."

-- కేపీ శర్మ ఓలి, నేపాల్ మాజీ ప్రధాని

నేపాల్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించే విధంగా తమపార్టీ పనిచేస్తుందని ఓలీ తెలిపారు. ఇరుదేశాల ఆసక్తి, లాభాలను దృష్టిలో ఉంచుకునే అంతర్జాతీయ సంబంధాలు ఏర్పరచుకుంటామన్నారు.

దేశాభివృద్ధి కోసం..

నేపాల్ అభివృద్ధి కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ముందుకురావాలని నేపాల్ ప్రధాని షేర్​ బహదూర్​ దేవ్​బా పిలుపునిచ్చారు. రూల్​ఆఫ్ లా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, దేశాభివృద్ధి అన్నిపార్టీల అజెండాగా ఉండాలన్నారు. నేపాల్​లోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు, బంగ్లాదేశ్​, భారత్, కాంబోడియా, శ్రీలంకకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్ నుంచి భాజపా నాయకుడు, మాజీ మంత్రి హర్ష్​వర్ధన్​ పాల్గొన్నారు.

ఏంటీ వివాదం..?

కాలపానీకి పశ్చిమాన ఉన్న లిపులేఖ్​ పాస్​ భూభాగంపై భారత్​- నేపాల్(India Nepal Border Dispute)​ మధ్య వివాదం నడుస్తోంది. రెండు దేశాలు కూడా కాలాపానీని తమ దేశంలో అంతర్భాగంగానే పరిగణిస్తున్నాయి. ఉత్తరాఖండ్​లోని పిథోర్​గఢ్​ జిల్లాలో కాలపాని ఉందని భారత్​ చెబుతుండగా.. నేపాల్ మాత్రం తమ పరిధిలోని ధార్చులా జిల్లాలో ఈ ప్రాంతం ఉందని పేర్కొంటోంది. ఈ క్రమంలో లిపులేఖ్​ పాస్​ను ఉత్తరాఖండ్​లోని ధార్చులాను కలుపుతూ భారత్​ నిర్మించిన రోడ్డు మార్గంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ నూతన భౌగోళిక మ్యాప్​ను రూపొందించింది.

nepal new territorial map
నేపాల్ నూతన భౌగోళిక మ్యాప్

మ్యాప్ వివాదం

భారత్​కు చెందిన లింపియాధురా, కాలాపానీ(Kalapani Dispute), లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా పరిగణిస్తూ నేపాల్ రాజకీయ భౌగోళిక మ్యాప్​ను తీసుకొచ్చింది. ఈ మ్యాప్​ను ఆ దేశ క్యాబినెట్ ఆమోదించింది. నేపాల్ చర్యను భారత్ ఖండించింది. కృత్రిమంగా చేసిన మార్పులను ఆమోదించేది లేదని తేల్చిచెప్పింది.

ఇవీ చూడండి:

'ఆ భూభాగాలు మావే.. నేపాలీలకు తిరిగే స్వేచ్ఛ ఉంది'

కాలాపానీ మాదేనంటూ నేపాల్ కొత్త మ్యాప్

భారత్- నేపాల్ మధ్య మళ్లీ కాలాపానీ రగడ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.