కరోనా వైరస్ ప్రభావం వాలంటైన్స్ డే వేడుకలపైనా పడింది. హాంకాంగ్‌లో ఏటా ఫిబ్రవరి 14న కిటకిటలాడే పూల దుకాణాలు ఈసారి మాత్రం వెలవెలబోయాయి.
"గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఘోరంగా వ్యాపారం జరిగింది. కరోనా వైరస్ భయంతో ప్రజలు వీధుల్లోకి రావటమే మానేశారు. ఫలితంగా 40 శాతం అమ్మకాలు తగ్గాయి. మాకు పూలన్నీ చైనా నుంచే రావాలి. కానీ కరోనా కారణంగా సరఫరా నిలిచిపోయింది. మేము పూలను నెదర్లాండ్స్, తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది."
-అమన్ఫాంగ్, పూల వ్యాపారి.
కరోనా కారణంగా పూల వ్యాపారం దెబ్బతినడంపై విక్రయదారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. "ప్రేమికుల దినోత్సవం రోజున పుష్పగుచ్ఛానికి బదులు మాస్కుల పెట్టె ఇచ్చే ఐ లవ్యూ చెప్పడమే ఉత్తమం" అని చమత్కరించారు.
సోషల్ మీడియాలోనూ ఇలాంటి పోస్టులే వెల్లువెత్తాయి. మాస్కులు, బియ్యం, టాయిలెట్ పేపర్, ఇతర వస్తువులతో చేసిన బొకేలు క్షణాల్లో అమ్ముడైపోతున్నట్లు ఉన్న పోస్టులు వైరల్ అయ్యాయి.
ఇదీ చూడండి:మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు