ETV Bharat / bharat

మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు

ఎన్నో భిన్నమైన ప్రేమ కథలు విని ఉంటాం. మరెన్నో చదివి ఉంటాం. అయినా.. ప్రేమంటే ఏమిటో చెప్పమంటే ఆలోచనలో పడతాం. అవును, విశ్వమంత ప్రేమను నిర్వచించడం కష్టమే మరి! కానీ, ఒడిశాలోని ఓ ప్రేమ జంటను చూస్తే మాత్రం ప్రేమంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. చేతులు లేని ప్రియుడికి చేయూతనిచ్చిన ఆ ప్రేయసి కథ మీరే చూడండి.

physically-impaired-person-love-story-from-goat-rearing-to-love-and-marriage
మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు
author img

By

Published : Feb 14, 2020, 5:37 PM IST

Updated : Mar 1, 2020, 8:32 AM IST

మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు

'ప్రియతమా.. నా హృదయమా' అని కవిత్వాలు రాసుకోలేదు. రోజాలిచ్చుకుని 'ఐ లవ్​ యూ డార్లింగ్​' అని చెప్పుకోలేదు. కనీసం ఫోన్​లో చాటింగులు చేసుకోలేదు. అయినా.. మేకలు కాచే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒడిశాకు చెందిన జగన్నాథ్​, ప్రతీక్ష తమ స్వచ్ఛమైన ప్రేమతో ఈ తరం ప్రేమికులకే ఆదర్శంగా నిలిచారు.

అలా మొదలైంది...

జాజ్​పుర్​ జిల్లా దశరథ్​పుర్​లోని జడగావ్ గ్రామానికి​ చెందిన జగన్నాథ్​ సేథికి పుట్టుక నుంచే రెండు చేతులు లేవు. జగన్నాథ్​ను అమ్మ ముద్దుగా జగ అని పిలుస్తుంది. చేతులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ జగ.. కాళ్లతోనే తన పనులు ఎలా చేసుకోవాలో అలవాటు చేసుకున్నాడు. పొట్టకూటి కోసం తన దగ్గరున్న మేకలతో పాటు గ్రామస్థుల మేకలూ కాచేవాడు.

నాలుగేళ్ల క్రితం ఎప్పటిలాగే మేకలు కాసేందుకు వెళ్లిన జగ జీవితంలోకి వచ్చింది ప్రతీక్ష సాహూ. పక్క గ్రామానికి చెందిన ప్రతీక్ష మేకలు కాస్తూ జగ వైపుగా వచ్చింది. మాటా మాటా కలిసింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొన్ని రోజులకు ప్రతీక్షను పెళ్లి చేసుకుంటానని మనసులో మాట చెప్పాడు జగ. కానీ, అప్పటికి ప్రతీక్షకు వివాహ వయసు రాలేదు కాబట్టి మూడేళ్లు వేచి చూశారు. ఈ మూడేళ్ల సమయంలో ఒకరినొకరు మరింత అర్థం చేసుకున్నారు.

ఊరు గుసగుసలాడే...

వీరి ప్రేమ కథ విన్న గ్రామస్థులంతా ఆశ్చర్యపోయేవారు. చూడచక్కని ప్రతీక్ష ఓ దివ్యాంగుడితో ప్రేమలో పడడం ఏంటని గొణుక్కున్నారు. వారి బంధం నిలబడేది కాదని చెవులు కొరుక్కున్నారు. పైగా వారిద్దరి కులాలు వేరు. ప్రతీక్ష తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ఇద్దరూ కలిసి ప్రేమను గెలిపించుకున్నారు. ప్రతీక్షకు 18 ఏళ్లు నిండగానే.. రిజిస్టర్​ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు.

జగ, ప్రతీక్షల స్వచ్ఛమైన ప్రేమ ముందు కుల మతాల గోడలు కూలిపోయాయి. వారి వివాహ బంధంతో సమాజపు అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు చేతులు లేని తన భర్తకు చేయూతగా నిలిచి గోరుముద్దలు తినిపిస్తోంది ప్రతీక్ష. పేద, ధనిక, అందం, వైకల్యం ఇవేవీ పట్టించుకోని వారి ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. నిజమైన ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో మరో సారి నిరూపించింది.

Last Updated : Mar 1, 2020, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.