ETV Bharat / international

వేసవి విహారానికి ఏ దేశం ఉత్తమమో తెలుసా? - Australia

ఎండాకాలం చాలా మంది విదేశాలకు పయనం అవుతుంటారు. కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటుంటారు. అయితే ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రాంతమైతే బాగుంటుంది? ఇతరులు ఎక్కడికి వెళ్తున్నారు? అనే ప్రశ్నలు వస్తుంటాయి. వీటి గురించి ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది కయక్​ అనే ట్రావెల్​ సెర్చ్​ ఇంజిన్​.

కుటుంబ విహారాలు ఎక్కువ ఏ దేశాల్లో..?
author img

By

Published : May 4, 2019, 11:16 AM IST

వేసవికాలం... మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యటనలకు వెళ్లేవారు ఎందరో. పాఠశాలలకు, కళాశాలకు సెలవులు ఉండటం వల్ల ఈ సమయంలోనే ఎక్కువగా కుటుంబంతో పాటు పయనమౌతుంటారు. కొందరు విదేశాలకు వెళ్లాలనుకుంటారు. వీటిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు ట్రెండింగ్​లో ఉన్నట్లు కయక్​ అనే ట్రావెల్​ సెర్చ్​ ఇంజన్​ తెలిపింది.

ఈ సంస్థ నివేదిక ప్రకారం... కుటుంబ విహారాలకు అమెరికాలోని హూస్టన్​ మొదటి గమ్యస్థానం. ఈ ప్రాంతానికి సంబంధించి వెతికేవారు​ గత ఏడాదితో పోల్చితే 151 శాతం పెరిగారు.

బోస్టన్​ రెండో గమ్యస్థానంగా ఉంది. ఈ నగరానికి సంబంధించి వెతుకులాట​ 103 శాతం పెరిగింది. మూడో స్థానంలో 87 శాతం వృద్ధితో లాస్​ ఏంజెల్స్ నిలిచింది.

ఆస్ట్రేలియాలోని మెల్​ బోర్న్​ నాలుగో స్థానంలో ఉంది. ఈ నగరం గురించి వెతుకులాట 51శాతం పెరిగింది. కెనడాలోని టొరంటో ఐదో స్థానంలో ఉంది. ఈ నగర సెర్చింగ్​ 44శాతం పెరిగింది.

కయక్ ప్రముఖ ట్రావెల్​ సెర్చ్​ ఇంజిన్​గా ఉంది. ఇది ప్రయాణాలకు సంబంధించిన అన్ని సైట్లను వెతికి వినియోగదారులకు కావాల్సిన సమాచారం అందిస్తుంది. అలా ప్రయాణికులు విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, విహారయాత్ర ప్యాకేజీల వివరాలు తెలుసుకోవచ్చు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.