ETV Bharat / international

ఇరాన్​పై ప్రతీకార దాడి యోచనలో అమెరికా?

ఇరాన్​పై ప్రతీకార దాడికి అమెరికా ప్రణాళిక రచిస్తోందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే మొదట దాడికి అనుమతించిన ట్రంప్ అనంతరం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని తాజాగా పేర్కొంది. ఈ కథనాలపై స్పందించడానికి పెంటగాన్ నిరాకరించింది.

ఇరాన్​పై అమెరికా ప్రతీకార దాడి?
author img

By

Published : Jun 21, 2019, 2:29 PM IST

ఇరాన్​ తన నిఘా డ్రోన్​ను కూల్చివేయడంపై ఆగ్రహంగా ఉన్న అమెరికా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే దాడికి మొదట అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, అనంతరం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని తాజాగా పేర్కొంది.

అమెరికా నిఘా డ్రోన్​ను ఇరాన్ కూల్చివేయడం అతిపెద్ద తప్పుగా ట్రంప్ అభివర్ణించారు. ప్రతీకారంగా ఇరాన్​ రాడార్, క్షిపణి బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాలని భావించారని న్యూయార్క్​ టైమ్స్ తెలిపింది. అయితే అనంతర పరిణామాల్లో దాడి నిర్ణయాన్ని ఉన్నతాధికారులు విరమించుకున్నారని పేర్కొంది. భవిష్యత్తులో ప్రతీకార దాడులు జరిపే ప్రణాళికలు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టంగా ఉందంది.

న్యూయార్క్ టైమ్స్​ కథనాలపై స్పందించడానికి శ్వేతసౌధం, అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నిరాకరించింది.

పతాకస్థాయికి ఉద్రిక్తతలు..?

ఇంతకు మునుపు.... తమ గగనతలంలోకి అక్రమంగా చొరబడిన అమెరికా నిఘా డ్రోన్​ను కుల్చేశామని ఇరాన్ ప్రకటించింది. దాని శకలాలను తమ ప్రాదేశిక జలాల్లో స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేసింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోనూ విడుదల చేసింది.

అయితే ఇరాన్ క్షిపణి దాడి చేసినపుడు తమ డ్రోన్ అంతర్జాతీయ జలాల్లోనే ఉందని పెంటగాన్​ ప్రకటించింది.

ఏ క్షణానికి ఏమి జరుగునో...

ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తమ డ్రోన్​ను ఉద్దేశపూర్వకంగా కూల్చివేసి ఉద్రిక్తతలను తిరగదోడి ఇరాన్ తెలివితక్కువ పనిచేసిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమ భూ, జల, వాయు సంపదపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావేద్ జారిఫ్ తెలిపారు.
ఈ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటుండడం వల్ల ఏ క్షణానికి ఏమవుతుందోనని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: లోక్​సభ ముందుకు ముమ్మారు తలాక్ బిల్లు

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 21 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0658: Hong Kong Protest 4 AP Clients Only 4216912
Protesters gather outside HKong police HQ
AP-APTN-0648: US TX Immigration Children AP Clients Only 4216911
Migrant children on neglect at Texas border
AP-APTN-0620: India Modi Yoga AP Clients Only 4216910
Bend it like Modi: Indian PM marks Yoga Day
AP-APTN-0537: US TX South Texas Officer Shot Must Credit KRGV, No Access Weslaco/Harlingen, No Use US Broadcast Networks 4216904
South Texas officer shot dead, suspect arrested
AP-APTN-0533: North Korea Xi Mass Games No access mainland China 4216903
Splits, flags & fireworks: Xi attends Mass Games
AP-APTN-0521: Philippines China Protest AP Clients Only 4216902
Filipinos in Manila protest against China
AP-APTN-0517: Hong Kong Protest 3 AP Clients Only 4216901
Protesters in Hong Kong block road
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.