Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన రెండు భూకంప సంఘటనల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుర్కమెనిస్థాన్కు సరిహద్దు ప్రాంతంలోని క్వాదిస్, ముకుర్‌లో ఈ భూకంపాలు సంభవించాయి. భూప్రకంపనలకు ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారని స్థానిక మీడియాసంస్థ పేర్కొంది.
మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3 శాతం నమోదు కాగా, రెండో భూకంపం 4.9గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.
పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బంది మధ్యలోనే చిక్కుకుపోయారు. మంగళవారం మరిన్ని సహాయక బృందాలను ఘటనా స్ధలాలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు.. డ్రైవర్ షాక్‌లోకి