ETV Bharat / international

మలాలాకు తాలిబన్​ ఉగ్రవాది బెదిరింపులు - మలాలాకు బెదిరింపులు

మానవహక్కుల కార్యకర్త, నోబెల్​ గ్రహీత మలాలా యూసుఫ్​ జాయ్​ని పాకిస్థానీ తాలిబన్ ఎసానుల్లా ట్విట్టర్​ వేదికగా బెదిరించాడు. తొమ్మిదేళ్ల క్రితం ఆమెపై హత్యాయత్నం చేసిన అతను మరోమారు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

Malala
మలాలాని బెదిరించిన తాలిబన్​- ట్విట్టర్​ ఖాతా తొలగింపు
author img

By

Published : Feb 18, 2021, 9:26 AM IST

నోబెల్​ గ్రహీత.. పాకిస్థానీ సామాజిక కార్యకర్త మలాలా యూసఫ్‌ జాయ్​కు మరోమారు బెదిరింపులు వచ్చాయి. తొమ్మిదేళ్ల క్రితం.. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ తాలిబన్​ ఉగ్రవాదే ఇప్పుడూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 'ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదు' అంటూ ట్వీట్​ చేశాడు ఎసానుల్లా ఎసాన్​.

"పాకిస్థాన్​కి రా? అప్పుడు గురి తప్పింది, ఈసారి తప్పే ప్రసక్తే లేదు," అని మలాలాని ఉర్దూలో ట్విట్టర్​ వేదికగా బెదిరించాడు ఎసాన్​. ​దాంతో వెంటనే అతని ట్వట్టర్​ ఖాతాని తొలగించింది.

ఉగ్రవాది ట్వీట్​పై మలాలా స్పందించారు. పాకిస్థానీ నిఘా విభాగం కస్టడీలో ఉన్న ఎసాన్​ ఎలా తప్పించుకున్నారో చెప్పాలని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ని, సైన్యాన్ని మలలా ప్రశ్నించారు.

తొమ్మిదేళ్ల క్రితం మలాలాని తుపాకీతో కాల్చి తీవ్రంగా గాయపరిచాడు ఎసాన్​. 2014లో పాక్​ ఆర్మీ పాఠశాలపై దాడి చేసి 134 మందిని(అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు) కేసులో ఎసాన్​ని 2017లో అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు పాక్​ నిఘావిభాగం కస్టడీలో ఉన్నాడు. కానీ 2020లో తప్పించున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడనే విషయంపై చాలా వివాదాలే ఉన్నాయి. ప్రస్తుతం అతను టర్కీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు ఎసాన్​ పై ఆర్మీ ఎలాంచి అభియోగాల్ని మోపకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.