ETV Bharat / international

శాంతి ఒప్పందం రద్దు- అఫ్గాన్​పై పోరుకు తాలిబన్లు సిద్ధం - అఫ్గానిస్థాన్​

taliban-say-will-resume-operations-against-afghan-forces
శాంతి ఒప్పందం రద్దు- అఫ్గాన్​పై పోరుకు తాలిబన్లు సిద్ధం
author img

By

Published : Mar 2, 2020, 6:46 PM IST

Updated : Mar 3, 2020, 4:43 AM IST

18:42 March 02

శాంతి ఒప్పందం రద్దు

అఫ్గానిస్థాన్​లో శాశ్వత శాంతి స్థాపనకు జరిగిన కీలక ప్రయత్నం విఫలమైంది. కొద్ది రోజుల క్రితం కుదిరిన శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు తాలిబన్లు. అఫ్గాన్​ సైన్యంపై తమ పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టంచేశారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ మార్చి 10న ప్రారంభమయ్యే శాంతి చర్చలకు ముందు తాలిబన్ ఖైదీలను విడుదల చేసేది లేదని  స్పష్టం చేసిన మరుసటిరోజే తాలిబన్లు ఈ ప్రకటన చేశారు.  తాలిబన్ ఖైదీల విడుదల నిర్ణయంపై అమెరికా జోక్యానికి తావు లేదని ఘని తేల్చి చెప్పారు. ఫలితంగా అమెరికా-తాలిబన్​ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడినట్టయింది.

ఈ నేపథ్యంలో తాము ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తాలిబన్లు తెలిపారు. దోహా ఒప్పందం ప్రకారం విదేశీ బలగాలపై దాడులు చేయబోమని చెప్పారు. అప్గాన్​ పరిపాలనా బలగాలకు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు  కొనసాగుతాయని  స్పష్టం చేశారు. 

శాంతి ఒప్పందం...

గత 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్​లో కొనసాగుతున్న అశాంతికి ముగింపు పలుకుతూ అమెరికా-తాలిబన్​ల మధ్య శనివారం శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా 5000 మంది వరకు తాలిబన్ ఖైదీలను అఫ్గాన్ ప్రభుత్వం, 1000 మంది ఖైదీలను తాలిబన్​లు విడుదల చేయాలని నిర్ణయించారు.

రానున్న 14 నెలల్లో ప్రణాళికాబద్ధంగా తమ సైనిక దళాలను అఫ్గానిస్థాన్​ నుంచి ఉపసంహరిస్తామని అమెరికా మాత్రం పేర్కొంది. అయితే ఇదంతా ఉగ్రవాద నిరోధక పనితీరుతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అఫ్గాన్​ అంతర్గత చర్చల పురోగతితో సంబంధం లేదని పేర్కొంది.

అయితే మార్చి 10న నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ వర్గాల మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. తాజాగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ వ్యాఖ్యలు, తాలిబన్ల ప్రకటన ఒప్పందంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

Last Updated : Mar 3, 2020, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.