ETV Bharat / international

అఫ్గాన్​ ప్రభుత్వంతో చర్చలకు తాలిబన్లు సన్నద్ధం - తాలిబన్లు

అఫ్గానిస్థాన్​ ప్రభుత్వంతో మరో దఫా చర్చలకు సన్నద్ధమవుతున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. దీనితో అఫ్గాన్​లో శాంతి స్థాపనకు మరో అడుగు ముందుకు పడినట్టయ్యింది.

Taliban say they are readying for talks with Kabul leaders
మరో దఫా చర్చలకు తాలిబన్లు సన్నద్ధం
author img

By

Published : Jun 8, 2020, 7:40 PM IST

అఫ్గానిస్థాన్​లో శాంతి స్థాపనకు మరో ముందడుగు పడినట్టు కనిపిస్తోంది. అఫ్గాన్​ నేతలతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు తాలిబన్లు ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే దీని కోసం ఇంకా తేదీని నిర్ణయించలేదు.

సంప్రదింపులు జరపడం కోసం తమ సభ్యుల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తోంది తాలిబన్​ నేతృత్వంలోని మండలి. పేరు చెప్పడం ఇష్టం లేని ఓ తాలిబన్​ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఖైదీల అప్పగింత...

ఖైదీల అప్పగింత అంశం ఈ చర్చలపై కీలక ప్రభావం చూపనుంది. సోమవారం నాటికి 2,710మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు బదులుగా.. 531మంది అఫ్ఘాన్​ మిలిటరీ, పౌర సిబ్బందిని విడుదల చేసింది తాలిబన్​.

అఫ్గానిస్థాన్​లో శాంతి స్థాపనకు ఫిబ్రవరి 29న అమెరికా-తాలిబన్ల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే 5,000 మంది తాలిబన్లు, 1,000 మంది ప్రభుత్వ, మిలిటరీ అధికారులను విడుదల చేయడానికి పరస్పరం అంగీకరించుకున్నాయి.

ఇదీ చూడండి:- 'తాలిబన్లకు కశ్మీర్​పై ఎలాంటి ఆసక్తి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.