ETV Bharat / international

'ఇగ్లూ టౌన్'​లా మారిపోయిన బీచ్.. వారెవా క్యా సీన్​ హై! - ఇగ్లూ మంచు నిర్మాణాలు

Siberia igloo festival: సైబీరియాలోని ఓబీ సముద్ర తీరంలో నిర్వహించిన ఇగ్లూ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. మంచు బ్లాకులతో ఇగ్లూలను నిర్మించేందుకు పోటీలు పడ్డారు పోటీదారులు. గత ఏడేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.

Siberia igloo festival
Siberia igloo festival
author img

By

Published : Feb 16, 2022, 5:51 PM IST

Updated : Feb 16, 2022, 7:29 PM IST

ఇగ్లూ ఫెస్టివల్

Siberia igloo festival: రష్యాలో ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహించే ఇగ్లూ పోటీలు ఈసారి ఉత్సాహంగా సాగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సముద్రంలో ఏర్పడిన మంచు బ్లాకులను తీసుకొచ్చి ఒక దానిపై ఇంకొకటి ఆడుతూ.. పాడుతూ అమర్చి.. ఇగ్లూలను నిర్మించారు. సైబీరియాలోని ఓబీ సముద్ర తీరం ఈ ఇగ్లూ ఫెస్టివల్​కు వేదికైంది.

IGLOO FESTIVAL
ఇగ్లూ ఫెస్టివల్

Igloo festival Snow structures

మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అతిశీతల ప్రాంతాల్లో.. ఎస్కిమోలు అనే స్థానిక ప్రజలు నివసించే మంచు గృహాలను ఇగ్లూలు అంటారు. సాధారణంగా ఇగ్లూ పైకప్పుపై కీస్టోన్​ను అమరుస్తారు. అది సరిగా ఉంటే.. వేడి లోపలికి వెళ్లదు. తద్వారా ఇగ్లూ కరగకుండా ఉంటుంది.

IGLOO FESTIVAL
పోటీదారు నిర్మించిన ఇగ్లూ

"ఇగ్లూను నిర్మించడానికి ఒక సాంకేతికత విధానం ఉంది. మంచు బ్లాకులను సరిగ్గా కత్తిరించాలి. అవన్నీ ఖాళీలు లేకుండా అమర్చాలి. ముఖ్యంగా కీస్టోన్​ను అమర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండ్రపు ఆకారంలో ఇగ్లూ నిర్మించడం చాలా కష్టం. అందుకే పాల్గొన్నవారు చాలా మంది గుడ్డు ఆకారంలో నిర్మించారు."

-వ్యాచెస్లావ్ గోర్యునోవ్, నిర్వాహకులు

stunning structure from snow blocks

ఈ పోటీలో పాల్గొన్న ఒక్కో టీమ్​కు రెండున్నర గంటల సమయం ఇచ్చారు నిర్వాహకులు. సైబీరియాలో ఈ ఏడాది మైనస్​ 16 డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదవుతోంది. గతేడాది కన్నా ఈ సంవత్సరం వాతావరణం అనువుగా ఉంది. అయితే మంచు బ్లాకులు సన్నగా ఉండటం వల్ల అవి తొందరగా విరిగిపోతున్నాయంటున్నారు పోటీదారులు.

IGLOO FESTIVAL
పోటీలో పాల్గొన్న ఔత్సాహికులు

"మేము ఈ పోటీకి నాలుగోసారి వచ్చాం. మొదటి సారి స్నేహితులుతో వచ్చి విఫలమయ్యాం. రెండో సారి, మూడో సారి వచ్చి ఇగ్లూని నిర్మించాం. ఇప్పడు టీమ్​గా వచ్చి పెద్ద ఇగ్లూని నిర్మించాం. గెలుపు మాదే అని అనుకుంటున్నాం."

-నికోలాయ్ నికోలాయేవ్, పోటీదారుడు

గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఇగ్లూ ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నారు. ఏటా పాల్గొనే వారి సంఖ్య దాదాపు 30శాతం పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కుటుంబసమేతంగా వచ్చి ఈ పోటీలో పాల్గొని 123 ఇగ్లూలను పోటీదారులు నిర్మించారు.

ఇదీ చదవండి: సింహాల వాలంటైన్స్ డే.. గిఫ్ట్​లు ఏమిచ్చారంటే?

Last Updated : Feb 16, 2022, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.