దశాబ్ద కాలంగా సాగుతున్న బంధానికి తెరదించితూ.. పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం, చమురు సరఫరాను నిలిపివేసింది సౌదీ అరేబియా. కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా నిలబడకపోవడం వల్ల ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్)పై పాక్ విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.
దీనితో పాటు సౌదీ ఇచ్చిన 1 బిలియన్ డాలర్లను కూడా పాకిస్థాన్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. 2018 నవంబర్‌లో 6.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది సౌదీ. ఇందులో 3 బిలియన్ డాలర్లు రుణాలు కాగా... మిగిలినవి చమురుకు సంబంధించినవి. గతేడాది ఫిబ్రవరిలో.. పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేశారు.
'మీరు మద్దతివ్వకపోతే.. ఇస్లామిక్ దేశాల సమావేశానికి పిలుపునివ్వాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను నేను అడగాల్సి ఉంటుంది. కశ్మీర్ విషయంలో ఆ దేశాలన్నీ మాకు మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాయి', అని ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికలను సౌదీ తీవ్రంగా పరిగణించిందని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.
ఇదీ చూడండి:- 'జల చర్చల' వేదికపై భారత్- పాక్ తలో మాట