ETV Bharat / international

కొరియా సొంత రాకెట్ ప్రయోగం- ఫలిస్తే చరిత్రే!

సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రాకెట్ ప్రయోగానికి దక్షిణ కొరియా సర్వం సిద్ధం చేసింది. 1.5 టన్నుల బరువైన డమ్మీ పేలోడ్​ను రాకెట్​ ద్వారా భూకక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. సొంత పరిజ్ఞానంతో అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు చేపట్టిన పదో దేశంగా రికార్డు సృష్టించనుంది.

S Korea prepares test of 1st domestically made space rocket
దక్షిణ కొరియా సొంత రాకెట్ ప్రయోగం
author img

By

Published : Oct 21, 2021, 4:29 PM IST

దేశీయంగా తయారు చేసిన స్పేస్ రాకెట్ ప్రయోగానికి దక్షిణ కొరియా (South Korea rocket launch) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే.. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. మూడు దశల్లో సాగే నూరి రాకెట్ ప్రయోగం (South Korea rocket launch) ద్వారా.. 1.5 టన్నుల స్టీల్​, అల్యూమినియంతో కూడిన డమ్మీ పేలోడ్​ను భూకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

షెడ్యూల్​కు గంట ముందే ప్రయోగం (South Korea rocket launch) చేపట్టాలని అనుకున్నప్పటికీ.. రాకెట్ లోపల వాల్వ్​లను పరీక్షించేందుకు ఇంజినీర్లు కొంత సమయం కోరినందున ఆలస్యమైంది. రాకెట్​లో ఎలాంటి లోపాలు బయటపడలేదని, గాలి వేగం, ఇతర పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రయోగం (South Korea rocket launch) చేపడతామని దక్షిణ కొరియా డిప్యూటీ సైన్స్ మినిస్టర్ యోంగ్ హోంగ్ టేక్ పేర్కొన్నారు.

ఫలిస్తే.. పదో దేశం

1990ల నుంచి తమ శాటిలైట్​లను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇతర దేశాలపై ఆధారపడుతోంది దక్షిణ కొరియా. తాజా ప్రయోగంలో (South Korea rocket launch) విజయం సాధిస్తే.. సొంత సాంకేతికతతో ఉపగ్రహ ప్రయోగం చేపట్టిన పదో దేశంగా చరిత్ర లిఖించనుంది. కమ్యూనికేషన్ శాటిలైట్లు, సైనిక ఉపగ్రహాలు పంపించేందుకు ఈ ఘనత (South Korea satellite launch) సాధించడం చాలా ముఖ్యమని అక్కడి అధికారులు భావిస్తున్నారు. 2030 నాటికి చంద్రుడి అన్వేషణకూ ప్రయోగాలు చేపట్టాలని ప్రణాళికలు వేసుకుంది దక్షిణ కొరియా.

గతంలో ఇలా..

ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి ఇదివరకే పలు ప్రయోగాలు (South Korea satellite launch) చేసింది దక్షిణ కొరియా. 2009లో తొలిసారి నారో అనే రాకెట్ ప్రయోగించింది. అనుకున్న ఎత్తుకు చేరుకున్నప్పటికీ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో ఈ రాకెట్ విఫలమైంది. 2010లో నిర్వహించిన రెండో ప్రయోగంలో.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాకెట్ పేలిపోయింది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు వైఫల్యాలే పలకరించాయి. చివరకు 2013లో రెండు దశల రాకెట్​ను ఉపయోగించి నారో స్పేస్​పోర్ట్ నుంచి మరో ప్రయోగం (South Korea satellite) చేపట్టింది. అయితే ఇందులో వాడిన సాంకేతికత చాలా వరకు రష్యాదే.

కిమ్ దేశం ఏమంటుందో?

ఇక దాయాది దేశమైన ఉత్తర కొరియా ఈ ఉపగ్రహ (South Korea rocket launch) ప్రయోగంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు ఉత్తర కొరియా సైతం ప్రయత్నించింది. అయితే సైనిక అవసరాల కోసం, దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధి కోసమే.. ఈ ప్రయత్నాలు చేసిందని ఉత్తర కొరియాపై ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.