రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు (Russia Coal Mine Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 820 అడుగుల లోతులో (Russia Coal Mine Accident) జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మందిని అధికారులు రక్షించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 44 మందిని ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలు ప్రారంభించినా..
ప్రమాదం జరిగిన సమయంలో (Russia Coal Mine Accident) హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి 239 మందిని కాపాడిన అధికారులు.. 14 మంది మృతదేహాలను గుర్తించారు. కానీ ఆ తర్వాత సహాయక చర్యలను ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం అప్పటికే ప్రమాదకర మీథేన్ గ్యాస్ గని అంతా వ్యాపించి ఉంది. ఈ నేపథ్యంలో గనిలో చిక్కుకున్న వారు బతికే అవకాశం కూడా లేదని అధికారులు తేల్చిచెప్పారు. మృతుల్లో పలువురు సహాయక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి భద్రతా నిబంధనలను పాటించని కారణంగా మైన్ డైరెక్టర్ సహా ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
బొగ్గు గనుల ప్రమాదాల్లో 2010 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. 2010లో ఓ మైన్లో జరిగిన ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం