ETV Bharat / international

జంతువులకు కరోనా టీకా పంపిణీ షురూ! - జంతువులకు కరోనా వ్యాక్సిన్

కరోనా నుంచి రక్షణగా జంతువులకు టీకా పంపిణీ ప్రారంభించింది రష్యా. తొలి విడతగా 17 వేల డోసులను అందుబాటులోకి తెచ్చింది. డిమాండ్ దృష్ట్యా వీటిని దేశంలోనే పంపిణీ చేస్తామని తెలిపింది.

Russia vaccinating animals against Covid-19
రష్యా జంతువుల టీకా, జంతువుల కరోనా టీకా రష్యా, రష్యా టీకా
author img

By

Published : May 27, 2021, 8:11 PM IST

రష్యాలో.. జంతువులకు కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కార్నివాక్-కోవ్ పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ను ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ టీకా ద్వారా ఆరు నెలల వరకు వైరస్ నుంచి రక్షణ లభించనుంది.

కార్నివాక్ వ్యాక్సిన్​ను ఇదివరకు కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం వెల్లడించింది. ఇది జంతువుల్లో ప్రభావవంతంగా పనిచేస్తోందని తెలిపింది.

పెంపుడు జంతువులకు టీకాలను అందించేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెటర్నరీ విభాగం సలహాదారు జూలియా మెలానో తెలిపారు. టీకాల కోసం క్లినిక్​లను సంప్రదిస్తున్నారని చెప్పారు.

భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఇదివరకు తెలిపింది. రష్యా వెటర్నరీ విభాగం అనుబంధ సంస్థ నుంచి 17 వేల డోసులతో తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఈ టీకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, తొలి బ్యాచ్ టీకాలను దేశంలోనే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, దాన్ని 50 లక్షలకు పెంచుతామని వివరించారు.

ఇదీ చదవండి- జంతువులకూ కరోనా వ్యాక్సిన్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.