ETV Bharat / international

రష్యాలో కరోనా మరణమృదంగం..రెండో రోజూ రికార్డు మరణాలు - రష్యా కరోనా కేసులు

రష్యాలో కరోనా(russia corona deaths today) తీవ్రరూపం దాలుస్తోంది. అక్కడ వరుసగా రెండో రోజూ రికార్డు స్థాయి మరణాలు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా పెయిడ్ హాలిడే ప్రకటించినప్పటికీ.. మహమ్మారి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సరిహద్దు దేశంలో నమోదవుతున్న కరోనా కేసులతో చైనా అప్రమత్తమైంది. 2000 మందిని క్వారంటైన్​కు తరలించింది.

russia corona cases
రష్యా కరోనా మరణాలు
author img

By

Published : Oct 29, 2021, 10:38 PM IST

రష్యాలో కొవిడ్‌(Russia covid cases) విధ్వంసం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి కరోనా కేసులు(Corona virus in Russia) వెలుగుచూస్తున్నాయి. అక్కడ తాజాగా 1,163 మంది మరణించారు. దీనితో ఐరోపాలోనే అత్యధికంగా 2,36,220 మరణాలు ఇక్కడ నమోదయ్యాయి. మరోవైపు.. రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం స్వల్పంగా తగ్గింది. అక్కడ కొత్తగా 39,849కి కరోనా సోకింది.

కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ప్రత్యేక చర్యలు చేపట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వైరస్‌ కట్టడిలో భాగంగా.. పాఠశాలలు, రెస్టారెంట్‌లు సహా.. క్రీడలు, వినోదానికి సంబంధించిన ప్రాంతాలను మూసేశారు అధికారులు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు.

మ్యూజియంలు, థియేటర్లకు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్‌ వేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. క్లబ్‌లు ఇతర వినోద సంబంధిత ప్రదేశాలు మూతపడనున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు.. వ్యాక్సిన్‌ వేసుకోని వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని అధ్యక్షుడు పుతిన్‌(vladimir putin latest news)​ అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇంతచేస్తున్నా.. చాలామంది రష్యన్లు పెయిడ్‌ హాలిడేను విహార యాత్రలకు వెళ్లేందుకు ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ రష్యాలోని అన్ని వినోదాత్మక ప్రాంతాలను మూసివేయించారు. ఇదే సమయంలో ఈజిప్ట్‌, టర్కీకు వెళ్లేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు.

గర్వమైన ప్రకటన.. పేలవ ప్రదర్శన..

ప్రపంచంలోనే తొలి కరోనా టీకాకు రష్యా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గర్వంగా ప్రకటించింది. అయినా టీకా వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపనందు వల్ల వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది. మొత్తం 14.6కోట్ల మంది జనాభా ఉన్న రష్యాలో.. ఇప్పటి వరకు 5కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్నారు.

చైనా అప్రమత్తం..

తన సరిహద్దు దేశమైన మంగోలియాలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. అక్కడనుంచి వచ్చిన 2,000 మందికి పైగా పర్యటకులను రెండు వారాల పాటు క్వారంటైన్​కు తరలించింది. మంగోలియా నుంచి వచ్చిన పర్యటకుల్లో 48 మంది పాజిటివ్​గా తేలిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

2019లో వుహాన్‌లో మొట్టమొదటి కేసు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ చైనాలో 91,665 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయి.

కరోనా కట్టడి వ్యూహం..

అమెరికాలోని న్యూయార్క్​లో కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది నగర యంత్రాంగం. వైరస్​ను వ్యాప్తి చెందించే అవకాశం ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అంబులెన్స్‌ డ్రైవర్లు, అగ్నిమాపక సిబ్బందిలో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడట్లేదు. దీనితో.. వీరంతా శనివారం సాయంత్రంలోగా కనీసం ఒక డోస్ అయినా తీసుకున్నట్లు ఆధారాలు చూపించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని కార్మికులను సోమవారం నుంచి వేతనం రహిత సెలవుల కింద ఇళ్లకు పరిమితం చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.