ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ-ఓఐసీసమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి హాజరు కాలేదు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరు కావడమే దీనికి కారణంగా తెలిపారు. యూఏఈలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సమావేశాలకు సుష్మా ప్రత్యేక అతిథి.
ఖురేషి కుర్చీ ఇలా ఖాళీగా కనిపించింది
"పలు ఇబ్బందికర పరిస్థితులలో యూఏఈ పాక్‌కు బాసటగా నిలిచింది. కానీభారత విదేశాంగ మంత్రిని ఆహ్వానించడం మాత్రం సరికాదు" అన్నారు ఖురేషి. భారత్‌ను ఆహ్వానించేటప్పుడు యూఏఈ పాక్‌ను సంప్రదించలేదని ఖురేషీ పేర్కొన్నారు.
పరిశీలక హోదా వద్దు...
పాకిస్థాన్ విదేశాంగ శాఖఅధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్‌కు పరిశీలక హోదాను ఇవ్వడాన్ని వీరు వ్యతిరేకించనున్నారు.