ETV Bharat / international

వెయ్యేళ్లనాటి మహావిష్ణువు విగ్రహం స్వాధీనం - బంగ్లాదేశ్‌లో వెయ్యేళ్లనాటి మహావిష్ణువు విగ్రహం

బంగ్లాదేశ్​కు చెందిన ఉపాధ్యాయుడి నుంచి ఆ దేశ పోలీసులు పురాతన శ్రీమహావిష్టువు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇది ఆ ఉపాధ్యాయునికి సుమారు నెలన్నర క్రితం దొరికిందని పోలీసులు తెలిపారు.

బంగ్లాదేశ్‌
Bangladesh
author img

By

Published : Aug 6, 2021, 6:46 AM IST

వెయ్యేళ్ల నాటిదిగా భావిస్తున్న శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహాన్ని ఓ ఉపాధ్యాయుడి నుంచి బంగ్లాదేశ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి 'ది డైలీ స్టార్‌' పత్రిక గురువారం వెల్లడించింది. 12 కిలోల బరువు, 23 అంగుళాల ఎత్తు, 9.5 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహం అబూ యూసఫ్‌ అనే ఉపాధ్యాయుడికి నెలన్నర క్రితం దొరికిందని, అయితే అతడు దాని గురించి తమకు తెలియజేయలేదని పోలీసులు చెప్పారు.

అతడి ఇంటి నుంచి సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువు నుంచి మట్టిని తవ్వుతుండగా తనకు ఆ శిల్పం దొరికిందని, పనితో తీరిక లేకుండా ఉండడంతోనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని యూసఫ్‌ చెప్పారు.

ఇదీ చూడండి: పాక్​లో మరో ఆలయంపై దాడి- భారత్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.