పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బలూచిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార దిగ్గజాన్ని సెనేటర్‌గా చేసేందుకు 700 మిలియన్ల పాక్ కరెన్సీ స్వీకరించారంటూ ఆ దేశ మాజీ ప్రధాని, సీనియర్ ప్రతిపక్ష నేత షాహిద్ ఖాకాన్ అబ్బాసీ ఆరోపణలు చేశారు. మార్చి 3న జరిగిన సెనేట్ ఎన్నికల్లో మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు ఆయన పార్టీ అయిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ తో పాటు మరికొన్ని ఇతర పార్టీల ఓట్లు ఖాదిరకు పడ్డాయని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ నేత అబ్బాసీ వివరణ ఇచ్చారు.
ఈ స్థానంలో ఖదీర్ విజయం సాధించిన వెంటనే ఆయన్ను ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని గుర్తించాలని, కోర్టు సుమోటో కేసుగా స్వీకరించాలని అబ్బాసీ డిమాండ్ చేశారు. మరోవైపు.. శుక్రవారం జరగనున్న సెనేట్ చైర్మన్ ఎన్నికలో జోక్యం మానుకోవాలంటూ సైన్యం ప్రతినిధులను హెచ్చరిస్తూ పాకిస్థాన్ ముస్లింలీగ్(నవాజ్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ గురువారం ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి