Netflix OTT Top 10 Trending Movies Telugu : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నెట్ఫ్లిక్ టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తుంటుంది. అన్ని జానర్లలో భిన్న కంటెంట్, సినిమా, సిరీసులతో ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు, పైగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ది బెస్ట్ 5 చిత్రాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
నెం.1లో దేవర - యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'దేవర' తొలి భాగం అగ్ర స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను సాధించింది. ఈ చిత్రంతోనే బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
బ్లాక్ బస్టర్ బఘీర - కన్నడ హీరో, రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన లేటెస్ట్ మూవీ 'బఘీర'. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకునే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు శ్రీమురళి. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ ఈ సినిమాకు కథ అందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం టాప్ 2లో ట్రెండింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు 7 రేటింగ్ ఉంది. సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నయనతార బయోపిక్ - లేడి సూపర్ స్టార్ నయనతార సినీ జర్నీ, ప్రేమ, పెళ్లి ఆధారంగా తెరకెక్కిన 'నయనతార - బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీగా రిలీజైంది. ఈ డాక్యుమెంటరీ విషయంలో ధనుశ్ - నయనతార మధ్య వివాదం కూడా జరిగింది. ప్రస్తుతం ఇది టాప్ 3లో కొనసాగుతోంది.
కృతి సనన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ - కృతి సనన్ డ్యూయెల్ రోల్‌లో నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 'దో పత్తి'. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమా కథ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
మనసును తాకేలా సత్యం సుందరం - కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'సత్యం సుందరం'. ఈ సినిమా ఆడియెన్స్ మనసును తాకుతోంది. ఓటీటీ ట్రెండింగ్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.
ఇంకా టాప్ 10లో యానిమేటెడ్ మూవీ స్పెల్‌బౌండ్, కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ 'ది బకింగ్‌హమ్ మర్డర్స్', డీసీ సూపర్ హీరో మూవీ 'ఫ్లాష్', జీటీ మ్యాక్స్, హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ ఆరు నుంచి 10వ స్థానం వరకు ఉన్నాయి.
గ్రాండ్‌గా ఎమ్మీ అవార్డుల వేడుక - నిరాశపరచిన శోభిత ధూళిపాళ్ల నటించిన సిరీస్
'వాళ్లు సెకండ్ హ్యాండ్ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత