ETV Bharat / international

'నిరాధార వ్యాజ్యాలు వేస్తే.. భారీ మూల్యం తప్పదు' - pakistan court news on virus is fake

కరోనా వైరస్​ లేదని పిటిషన్​ దాఖలు చేసిన వ్యక్తికి రూ. 2లక్షల జరిమానా విధించింది పాకిస్థాన్​లోని లాహోర్​ హైకోర్టు. వైద్య పరమైన రుజువులు లేకుండా.. ఆధారాలు లేని వ్యాజ్యాల దాఖలు చేస్తే భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

Pakistani man fined for claiming COVID-19 pandemic is fake
'వ్యాజ్యం దాఖలు చేసేప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకోండి'
author img

By

Published : Dec 23, 2020, 8:26 PM IST

కరోనా మహమ్మారి లేదు. ప్రభుత్వం టీకా కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలంటూ పిటిషన్​ దాఖలు చేసిన ఓ వ్యక్తికి లాహోర్​ హైకోర్టు జరిమానా విధించింది. రూ. 2లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి నిరాధార వ్యాజ్యాలను దాఖలు చేసేప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది.

కరోనా వైరస్ అనేది అంతర్జాతీయ కుట్రలో భాగమని... ఇది చేతులు కలపడం ద్వారా రాదని అబ్బాస్​ తన పిటిషన్​లో పేర్కొన్నాడు. కొన్ని దశాబ్దాలుగా కొవిడ్​ లక్షణాలు మనలో ఉన్నయని.. అవేమీ ప్రాణాంతకం కాదంటూ తన వాదన వినిపించారు. దీనిపై స్పందించిన లాహోర్​ హైకోర్టు.. మహమ్మారి లేదనేందుకు గల వైద్య పరమైన రుజువులు ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది. ఇందుకు సమాధానంగా అబ్బాస్​ ఈ వైరస్​ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన అంతర్జాతీయ కుట్ర అని వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వాదనను పట్టించుకోని ధర్మాసనం రూ. 2 లక్షలు జరిమానా విధించింది.

అబ్బాస్​ వేసిన పిటిషన్​లో వాస్తవం లేదన్న న్యాయమూర్తి.. సమాజంలో గందరగోళం తలెత్తే వ్యాజ్యాలను దాఖలు చేసేప్పుడు జాగ్రత్త వహించాని హెచ్చరించింది.

ఇదీ చూడండి: 'పాక్​తో సంబంధాలపై భారత్​కు ఆందోళన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.