ETV Bharat / international

తక్కువ ధరకు కూరగాయలు అమ్మిన వ్యక్తి అరెస్ట్​ - కూరగాయల వ్యాపారి అరెస్టు

కరోనా పరిస్థితుల్లో కూరగాయలు తక్కువకు అమ్మితే.. ఉదారవాదిగా సమాజం కీర్తిస్తుంది. అయితే.. పాకిస్థాన్​లో మాత్రం మార్కెట్​ ధరల కన్నా తక్కువకు అమ్మినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. ఈ చర్యపై ఆ దేశంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

pakisthan vendor
కూరగాయల వ్యాపారి అరెస్
author img

By

Published : Jun 29, 2021, 6:40 AM IST

కరోనా కారణంగా ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. ఈ క్రమంలో తక్కువ లాభం వచ్చినా.. వస్తువులు అమ్ముడు పోవాలని చిరు వ్యాపారులు ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా ధరలను తగ్గించి అమ్ముతుంటారు. అయితే పాకిస్థాన్​లో ఓ వ్యాపారి ఇలా చేయడమే తప్పు అయ్యింది. ఇలా చేసినందుకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.

లాహోర్​లో వక్వాస్ అనే వ్యక్తి.. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. నగరంలో నిర్ణయించిన ధరకే కూరగాయలు విక్రయించాలనే నిబంధనను తీసుకువచ్చింది అక్కడి అధికార యంత్రాంగం. కానీ వక్వాస్​ మాత్రం అంతకన్నా తక్కువ ధరకు అమ్మాడు. కిలో టమాట మార్కెట్​ ధర రూ.50 ఉండగా.. 25కే విక్రయించాడు. ఉల్లిగడ్డ మార్కెట్​ ధర రూ.40 ఉండగా.. రూ.33కే విక్రయించాడు. దీంతో ధరల నియంత్రణ అధికారులు.. వక్వాస్​ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జూన్​ 15న వక్వాస్ అరెస్టు అయ్యాడు. మరుసటి రోజు బెయిల్​పై విడుదలయ్యాడు.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు భారీగా స్పందించారు. న్యాయమూర్తిపై ట్రోల్స్​ చేశారు.

ఇవీ చదవండి:వెంటపడిన జింక- నగ్నంగా పరుగో పరుగు!

యూకే విమానాల రాకపై ఆ దేశం నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.