భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి భారత్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పాక్ విదేశాంగశాఖ వెల్లడించింది. జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు అమలుచేసేందుకు చేపట్టే ఏ చర్య అయినా... అది పాక్ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
జాదవ్ కేసును సమీక్షించేందుకు చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాక్ సైన్యం ప్రకటించిన మరుసటి రోజే.. ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సమీక్షించండి..
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై పాక్ సైనికన్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా జాదవ్ మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం జులై 17న వెలువరించిన తన తీర్పులో.. పాకిస్థాన్‌కు సూచించింది.
ఇదీ చూడండి: భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్