ETV Bharat / international

చైనాకు పాక్​ ప్రత్యేక విమానం.. వ్యాక్సిన్​ కోసమేనా? - పాకిస్థాన్​లో వాక్సిన్​ పంపిణీ

కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్​ ఏర్పాట్లు ప్రారంభించింది. చైనాకు ఓ ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు ఆ దేశ ఎన్​సీఓసీ తెలిపింది. చైనాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 లక్షల టీకా డోసులు తీసుకొచ్చేందుకు విమానం పంపుతున్నట్లు వెల్లడించింది.

Pak to send special plane to China to receive first tranche of anti-COVID-19 vaccine
వాక్సిన్​ కోసం చైనాకు పాక్​ ప్రత్యేక విమానం
author img

By

Published : Jan 31, 2021, 1:06 PM IST

కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్​ చర్యలు మొదలుపెట్టింది. ఒప్పందంలో భాగంగా చైనా నుంచి వాక్సిన్​ దిగుమతి చేసుకోవడానికి సమాయత్తమైంది. మొదటి దఫాగా 5 లక్షల డోసులను తీసుకురావడానికి ఆదివారం చైనాకు ప్రత్యేక విమానాన్ని పంపనున్నామని ఆ దేశ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సీఓసీ) తెలిపింది. జనవరి 31లోపు 5 లక్షల డోసులను అందించే విధంగా చైనాతో పాక్​ ఒప్పందం కుదుర్చుకుంది. చైనీస్ సినోఫార్మ్​ వాక్సిన్​తో కలిపి రెండు కరోనా టీకాలను అత్యవసర వినియోగానికి పాక్​ ఇప్పటికే అనుమతించింది.

'వాక్సిన్​ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్లామాబాద్​లో టీకా నిల్వచేసి అన్ని రాష్ట్రాలకు అందించనున్నాం' అని ఎన్​సీఓసీ వెల్లడించింది. మొదట ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు, వద్ధులకు వాక్సిన్​ ఇవ్వనున్నట్లు తెలిపింది.

17 లక్షల డోసులు..

ఈ ఏడాది ప్రథమార్ధంలోగా పాకిస్థాన్​కు 17 లక్షల ఆస్ట్రాజెనికా టీకాను అంతర్జాతీయ టీకా సమన్వయ సంస్థ 'కోవాక్స్​' అందించనుందని ఆ దేశ మంత్రి అసద్​ ఉమర్​ ట్వీట్​ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్​ అలియన్స్​ ఫర్​ వాక్సినేషన్ అండ్​ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో 'కొవాక్స్​' ఏర్పడింది.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,43,214 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,623 మంది మరణించారు. 2,111 రోగులు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్​దే పైచేయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.