ETV Bharat / international

తీరు మార్చుకోని పాక్- గ్రే లిస్ట్​లోనే కొనసాగింపు!

author img

By

Published : Oct 18, 2020, 5:33 PM IST

ఉగ్రవాద కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న పాక్.. ఎఫ్​ఏటీఎఫ్ గ్రే లిస్ట్​లోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21-23 మధ్య జరిగే సమావేశంలో పాక్ విషయంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం తీసుకోనుంది.

Pak fails to fulfil 6 key mandates of FATF; no action against Masood Azhar, Hafiz Saeed
నిబంధనలు పాటించడంలో విఫలం- గ్రే లిస్ట్ లోనే పాక్!

పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ఆర్థిక కార్యాచరణ దళం(ఎఫ్ఏటీఎఫ్) నిర్దేశించిన 6 కీలక విధులను నిర్వర్తించడంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు విఫలమైంది. ఈ క్రమంలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు జరిగే ఎఫ్ఏటీఎఫ్ భేటీలో పాకిస్థాన్‌ను "గ్రే" జాబితా నుంచి తొలగించే అంశంలో ఏ నిర్ణయం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్‌, హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోకపోవడం సహా ఉన్నట్టుండి 4 వేల మంది ఉగ్రవాదులు.. ముష్కరుల జాబితా నుంచి మాయమవడం, పాక్‌ గడ్డ నుంచి ఉగ్రవాదులకు ఆర్థికపరమైన సహాయం ఇంకా అందుతూ ఉండడం వంటి చర్యలను ఎఫ్ఏటీఎఫ్ తీవ్రంగా పరిగణిస్తోంది.

ఎఫ్​ఏటీఎఫ్​లో నామినేటింగ్ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం పాక్ చర్యల పట్ల పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పాక్​లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని భావిస్తున్నాయి.

అప్పులు కష్టమే!

రోజురోజుకు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కబరుచుకునేందుకు అప్పులబాట పడుతున్న పాకిస్థాన్‌.. ఎఫ్​ఏటీఎఫ్ విధించిన 27 అంశాలను అమలు చేసేందుకు అంగీకరించింది. అయితే అందులో 21 మాత్రమే పాటించింది. కీలకమైన మిగిలిన ఆరింటిని అమలు చేయడంలో విఫలమైంది. కాబట్టి గ్రే జాబితా నుంచి పాక్‌ను తొలగించడం అసాధ్యమే అవుతుంది. ఈ క్రమంలో పాక్‌కు అప్పులు పుట్టడం కూడా కష్టమే.

2018 జూన్​లో పాకిస్థాన్​ను గ్రే లిస్ట్​లో చేర్చుతూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించడంలో విఫలమవుతూ అప్పటి నుంచి పాకిస్థాన్ అదే జాబితాలో కొనసాగుతోంది. గ్రే లిస్ట్​ నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే 12 ఓట్లు(మొత్తం 39 ఓట్లు) సాధించాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్ట్​ను తప్పించుకోవడానికి మూడు దేశాల మద్దతు అవసరం ఉంటుంది. చైనా, టర్కీ, మలేసియా దేశాలు పాకిస్థాన్ బ్లాక్ లిస్ట్​లో చేరకుండా అడ్డుపడుతున్నాయి.

ఇదీ చదవండి- పాక్​ 'బ్లాక్​లిస్ట్'​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.