ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు నిరాకరించిన పాకిస్థాన్‌ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సుతిమెత్తగా హెచ్చరించింది. జాతీయ నాయకులను తీసుకెళ్లే విమానాలను 'స్టేట్ ఎయిర్‌క్రాఫ్ట్'గా పరిగణిస్తారని, చికాగో ఒడంబడిక ప్రకారం ఈ విమానాలకు నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.
"కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ (చికాగో కన్వెన్షన్) నిబంధనలు కేవలం పౌర విమాన కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ నిబంధనలు జాతీయ నాయకులు ప్రయాణించే విమానాలకు, సైనిక విమానాలకు మాత్రం వర్తించవు."
- ఐసీఏఓ అధికార ప్రతినిధి
భారత్ ఫిర్యాదు..
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకోసం పాకిస్థాన్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే మోదీ విమానం తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్ అనుమతి నిరాకరించింది. జమ్ముకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఐసీఏఓ దృష్టికి తీసుకెళ్లింది.
ఐసీఏఓ అంటే
ఐసీఏఓ.. ఐక్యరాజ్యసమితి చెందిన ఓ ఏజెన్సీ. ఇది 'చికాగో కన్వెన్షన్' పాలనా బాధ్యతలు నిర్వహిస్తుంది.
ఇదీ చూడండి: