ఇరాన్‌లోని నటాన్జ్ అణు కేంద్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. ఇరాన్ తన అధునాతన సెంట్రిఫ్యూజ్ ఐఆర్-9 పరీక్షలను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం జరగటం గమనార్హం. ఇది ప్రమాదమేనని ఇరాన్ అణు కార్యకలాపాల అధికార ప్రతినిధి బెహ్రోజ్ కామల్వండి తెలిపారు. ఈ మేరకు స్టేట్ టీవీ కథనం వెలువరించింది.
ఈ ఘటన వల్ల ఎలాంటి కాలుష్యం కాలేదని, ఎవరూ గాయపడలేదని బెహ్రోజ్ కామల్ వండి చెప్పారు. అయితే దీనిని ప్రమాదం లేదా పేలుడు అనే దానిపై ఆయన పూర్తి స్పష్టతనివ్వలేదు.
నటాన్జ్ అణు కేంద్రంలో గతేడాది జులైలోనూ పేలుడు సంభవించింది.
ఇదీ చూడండి:'అణు' పరీక్షల్లో ఇరాన్ దూకుడు