ETV Bharat / international

వేడెక్కిన సముద్రాలు- 2019లో అత్యధిక ఉష్ణోగ్రతలు - SEA WEATHER NEWS

ప్రపంచవ్యాప్తంగా 2019 ఏడాది సముద్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కర్బన ఉద్గారాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Oceans were hottest on record in 2019
Oceans were hottest on record in 2019
author img

By

Published : Jan 15, 2020, 10:54 AM IST

ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో గతేడాది రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కర్బన ఉద్గారాల కారణంగా సముద్రాల్లో రోజురోజుకూ వేడి పెరిగిపోతోందన్నారు. ఫలితంగా వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

గ్రీన్​హౌస్​ వాయు ఉద్గారాల వల్ల వెలువడిన 90శాతం ఉష్ణాన్ని సముద్రాలు గ్రహిస్తాయి. గత కొద్ది సంవత్సరాల్లో ఈ వేడి తీవ్రత ఎలా ఉందనే వివరాల ద్వార భూతాపాన్ని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.

గడిచిన దశాబ్దాల్లో సముద్రంలో సుమారు 2వేల మీటర్ల లోతు వరకు నమోదైన వేడి తీవ్రతను గుర్తించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం భావించింది. ఇందుకోసం చైనా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అట్మాస్ఫియరిక్​ ఫిజిక్స్​(ఐఏపీ) అందించిన నివేదికను పరిశీలించింది. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో గతేడాది అత్యధికంగా 0.075 సెల్సియస్​ నమోదైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా సముద్ర మట్టాలు పెరుతున్నాయని, సముద్ర జీవులు మరణిస్తున్నట్లు తెలిపారు.

హిరోషీమా ఆటమ్​ బాంబుకు మించి..

గడిచిన 25 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల్లో ఉద్భవించిన వేడిని పరిశీలిస్తే.. ఈ తీవ్రత దాదాపు 3.6 బిలియన్​ హిరోషీమా ఆటమ్​ బాంబులతో సమానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చే అందుకు నిదర్శనమని హెచ్చరిస్తున్నారు. సముద్రాల్లో వస్తున్న మార్పులపై ఐక్యరాజ్యసమితి గతేడాది ఓ నివేదిక విడుదల చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శతాబ్దం ముగిసే సరికి తీరప్రాంతాల్లో నివాసముంటున్న కోట్లాది ప్రజలు నిరాశ్రయలువుతారని హెచ్చరించింది.

ప్రపంచ ఉష్ణోగ్రతలను 2 సెల్సియస్​కే కట్టడి చేయాలని తీర్మానించిన 2015 పారిస్ ఒప్పంద​ లక్ష్యాలను చేరుకోవాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: భాజపా తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా

Intro:Body:

dd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.