న్యూజిలాండ్‌లో దాదాపు 6నెలల తర్వాత కరోనా మరణం((Covid deaths)) నమోదైంది. దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు(Corona cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొవిడ్‌తో 90ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరం ఆక్లాండ్‌లో కొత్తగా 20 కేసులు నమోదయ్యాయి. ఇదే నగరంలో ఇటీవల తొలిసారి డెల్టాకేసు నమోదుకావటం వల్ల దేశవ్యాప్తంగా మూడురోజుల పాటు లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గతంలో రోజుకు గరిష్ఠంగా 80కేసులు నమోదవుతుండగా.. ప్రస్తుతం కేసులు భారీగా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.
పడకల కొరత..
మరోవైపు అమెరికా కాలిఫోర్నియాలోని ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల కొరత ఏర్పడింది. కరోనా కేసులు(Covid-19 cases) మళ్లీ పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నాలుగు వారాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం.. డబుల్ స్పీడులో రోజువారీ కేసులు పెరుగుతున్నాయన్నారు.
ఇటలీలో వ్యాక్సిన్ తప్పనిసరి..
కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరి చేయటంపై ఇటలీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతానికి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు. ఇప్పటికే ఇటలీలో 71శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశవ్యాప్తంగా 80శాతం మందికి టీకా అందించాలన్న లక్ష్యాన్ని సెప్టెంబర్ చివరినాటికి అధిగమిస్తామని ఇటలీ ప్రభుత్వం పేర్కొంది.
స్కూళ్లకు చిన్నారులు..
ఐరోపాలో.. దాదాపు 18నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. అయితే.. ఇటలీ, స్పెయిన్ దేశాలు మాత్రం విద్యార్థులకు భౌతికదూరం, మాస్కు తప్పనిసరి చేశాయి. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం ఉన్న అధ్యాపకులనే స్కూళ్లలోకి తీసుకుంటున్నారు. ఇక ఫ్రాన్స్‌లోనూ ఇలాంటి నిబంధనలే అమలవుతున్నాయి. చిన్నారులు కచ్చితంగా మాస్కులు ధరించి పాఠశాలకు రావాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంట్లోనే కరోనా టెస్టు- 20 నిమిషాల్లో ఫలితం!