ETV Bharat / international

ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట - నేపాల్​ సుప్రీంకోర్టు

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలికి మంగళవారం ఆ దేశ సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చట్టసభల్లో సభ్యులు కాని ఏడుగురిని మంత్రులుగా తిరిగి నియమించిన ఓలి ప్రమాణ స్వీకారం చెల్లదంటూ దాఖలైన రిట్​ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

PM Oli
ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
author img

By

Published : May 19, 2021, 6:54 AM IST

నేపాల్​ ప్రధానిగా తిరిగి నియామకమైన కేపీ శర్మ ఓలికి మంగళవారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చట్టసభల్లో సభ్యులు కాని ఏడుగురిని మంత్రులుగా తిరిగి నియమించిన ఓలి ప్రమాణ స్వీకారం చెల్లదంటూ దాఖలైన రిట్​ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు ససేమిరా అంది. ప్రమాణస్వీకార సందర్భంగా రాష్ట్రపతి చెప్పిన మాటలను తిరిగి చెప్పేందుకు నిరాకరించిన ఓలి.. దేశాధ్యక్షపీఠాన్ని అవమానించారంటూ నాలుగు రిట్​ పిటిషన్లు నేపాల్​ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

వీటిపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ప్రమాణస్వీకార సందర్భంగా ఏం జరిగిందన్న దానిపై 15 రోజుల్లోపు లిఖితపూర్వక సమాధానాలు సమర్పించాలని దేశాధ్యక్షురాలి కార్యాలయంతో పాటు ప్రధాని పేషిని, మంత్రిమండలిని కోరింది. ఈ సమాధానాలు చూసిన తరువాత రిట్​ పిటిషన్​లపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఇదీ చూడండి: నేపాల్​ ప్రధానిగా మరోమారు ఓలీ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.