ETV Bharat / international

నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది శనివారమే! - నేపాల్ ప్రధాని రాజీనామా

శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఓలి రాజీనామాపై పట్టుబట్టిన పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అభిప్రాయభేదాలను తొలగించుకునేందుకు ప్రధాని ఓలి, ప్రచండ కలిసి ఒంటరిగా సమావేశమైనట్లు కేబినెట్ సభ్యులు తెలిపారు.

Nepal ruling party's Standing Committee to meet on Saturday to decide Oli's fate
రేపే తేలనున్న నేపాల్ ప్రధాని భవితవ్యం!
author img

By

Published : Jul 3, 2020, 5:32 PM IST

నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి భవితవ్యం శనివారం తేలనుంది. జులై 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఓలి ప్రధానమంత్రి పదవిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాజీనామా కోసం డిమాండ్​లు ఎక్కువైన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆకస్తికరంగా మారాయి.

ప్రధానమంత్రి ఓలి రాజీనామాపై ఏకాభిప్రాయం కల్పించడంలో పార్టీ ఉన్నతాధికారులు విఫలమైన నేపథ్యంలో గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశాలను వాయిదా వేశారు.

ఓలి రాజీనామా చేయాల్సిందేనని గురువారం నుంచి పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత్​కు వ్యతిరేకంగా ఓలి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని స్పష్టం చేశారు.

"ప్రధాని పదవి నుంచి తొలగించడానికి భారత్​ కుట్రచేస్తోందన్న ఓలి వ్యాఖ్యలు దౌత్యపరంగా, రాజకీయంగా సరైనవి కావు. వ్యూహాత్మకంగా కీలకమైన భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో దేశ మ్యాప్​ను నవీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొంత మంది నేపాల్ రాజకీయ నేతలు ఓలితో భాగస్వామ్యమయ్యారు. పార్టీ నాయకులతో పాటు పొరుగుదేశాలపై ఆరోపణలు చేయడం సరైనది కాదు."

-పుష్ప కమల్ దహాల్ (ప్రచండ), నేపాల్ కమ్యునిస్టు పార్టీ ఛైర్మన్

పార్టీకీ, ప్రభుత్వానికి సమన్వయం లేదని ప్రచండ అభిప్రాయపడుతున్నట్లు నేతలు చెబుతున్నారు. పార్టీ అనుసరిస్తున్న ఒక వ్యక్తి ఒకే హోదా విధానాన్ని అందరూ అనుసరించేలా ఆయన ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. గురువారం జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలను ఓలి రద్దు చేయడం వల్ల పార్టీలోని రెండు వర్గాల మధ్య అభిప్రాయభేదాలు మరింత పెరిగిపోయాయన్నారు.

ఉమ్మడి విధానం

ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో రెండు వర్గాలు ఓ విధానాన్ని రూపొందించుకునే అవకాశం ఉందని పార్టీ నేత గణేష్ షా తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వం అనుసరించడానికి ఈ విధానాలు రూపొందించడం ద్వారా ఈ భేదాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రధానమంత్రి ఓలి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రచండను స్వయంగా పనిచేయడానికి ఆయన అనుమతించడం లేదు."

-గణేష్ షా, స్టాండింగ్ కమిటీ సభ్యుడు

"ప్రధానమంత్రికి రెండు ఆప్షన్స్​ ఉన్నాయి. ఒకటి పార్టీ కుర్చీని వదులుకోవాలి. లేదా ఒక వ్యక్తి ఒక హోదాను అనుసరించి ప్రధాని పదవిని త్యజించాలి."

-బిష్ణు రిజాల్, ఎన్​సీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పార్టీ విదేశీ వ్యవహారాల ఉపాధ్యక్షుడు

మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ ఓలి రాజీనామా చేయాలని సభ్యులు పట్టుబట్టారు. పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొరుగుదేశాలతో పాటు పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీని చీల్చేందుకే!

పార్టీని చీల్చడానికి అనుమతించే బిల్లును మళ్లీ తీసుకొచ్చేందుకే పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసినట్లు సీనియర్ కేబినెట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం అధికార పార్టీ నేతలే వ్యతిరేకించడం వల్ల అప్పట్లో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారు ఓలి.

ప్రతినిధుల సభ లేదా కేంద్ర కార్యనిర్వాహక కమిటీల్లో 40 శాతం సభ్యుల అనుమతితో పార్టీని అధికారికంగా విచ్ఛిన్నం చేయడానికి బిల్లు అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. 275 సీట్లు ఉన్న నేపాల్ పార్లమెంట్​లోని ప్రతినిధుల సభలో ఎన్​సీపీకి 174 స్థానాలున్నాయి.

ప్రస్తుతం ఓలి, ప్రచండ ఇరువురు కలిసి ప్రధాని నివాసంలో ఒంటరిగా సమావేశమైనట్లు కేబినెట్ సభ్యులు తెలిపారు. తాజాగా తలెత్తిన వివాదాలను పరిష్కరించుకొని తమ అభిప్రాయభేదాలను తొలగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.